- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మండుటెండలో ఉపాధి హామీ కూలీల అవస్థలు..
దిశ, చిన్నశంకరంపేట : భానుడు భగభగ మండుతున్నాడు.. ఇంట్లో నుండి బయటకు వెళ్లాలంటే కష్టంగా ఉంది. ఉదయం 8 గంటలకే ఎండ మండిపోతుంది. జాతీయ ఉపాధి హామీ పథకం కోసం కూలీలకు కనీస సౌకర్యాలు లేకపోవడంతో ఎండలోని పనులు చేపట్టవలసి వస్తుంది. వడదెబ్బ తలిగి పలువురు కూలీలు అవస్థలు పాలై ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్సలు పొందుతున్నారు. ఇటీవల నార్సింగి మండలం సేరిపల్లి గ్రామానికి చెందిన ఉపాధి కూలీ మేదరి బాలమని పనులు చేస్తూ వడదెబ్బ తలిగి తనువు చాలించింది.
పని ప్రదేశంలో వసతులు కల్పించవలసిన అధికారులు దృష్టి సాదించకపోవడంతో అగచాట్లు తప్పని దుస్థితి ఏర్పడింది. మండలంలో 29 గ్రామాలలో చెరువు పూడిక తీత, మట్టి రోడ్లు వేయుట, కందకాలు, వ్యవసాయ కాల్వపనుల పూడిక తీయుట, కొత్తగా మట్టి రోడ్ల నిర్మాణం వంటి పనులు జోరుగా సాగుతున్నాయి. మండలంలో 29 వందల మంది కూలీలు ఉపాధి పనులు చేస్తున్నారని ఉపాధి హామీ ఎపీఓ వెంకట సాయ గౌడ్ తెలిపారు. ఉదయం 6 గంటలకు కూలీలు నిర్దేశించిన ప్రాంతాలకు వెళ్లి పనులు చేస్తున్నారన్నారు. గంటకి ఎండ సుర్రుమని వచ్చేస్తుంది 11 గంటల వరకు పనులు చేస్తున్నారు.
ప్రథమ చికిత్స కిట్లు కరువు..
పనిచేసే చోటు ప్రథమ చికిత్స కిట్లు అందుబాటులో ఉంచేవారు. అయోడిన్ సీసా బ్యాండేజ్ దూది కొన్ని రకాల మందులు ఉండాలి. ఎవరైనా గాయపడితే చికిత్స అందించేవారు. అయితే ఇవి 2016 వరకు ఇచ్చారు కానీ ప్రస్తుతం మాత్రం ఏమీ లేవు. అప్పటినుండి నేటి వరకు ఏ ఒక్క వసతి కూడా అందుబాటులోకి రావడం లేదు.
కూలీలు సొంత డబ్బులతో కొనుక్కొని..
ఉపాధి కూలీలకు ప్రభుత్వం నుంచి గడ్డపార, తట్టలు వంటివి పంపిణీ చేయవలసి ఉంది. కానీ అవేవీ కూడా ఇవ్వడం లేదు. విశ్రాంతికి తెంట్లు ఎక్కడ..?
ఉపాధి కూలీలు పనులు చేసి విశ్రాంతితో పాటు భోజనం చేసి సేద తీరేనందుకు గతంలో గుడారాలు ఇచ్చేవారు. క్షేత్ర సహాయకులు పని ప్రదేశానికి సైతం తీసుకువెళ్లే వారు. ఇప్పుడు అవి ఎక్కడ కనిపించడం లేవు గతంలో ఇచ్చినవి చినిగిపోవడంతో ఎందుకు పనికి రాకుండా పోయాయి కనీసం వాటిని పంపిణీ చేసిన నీడైనా దక్కేది.
ఈ విషయమై ఎంపీడీవో ప్రవీణ్ వివరణ కోరగా జాతీయ ఉపాధి హామీ పనుల జరిగే చోట ప్యాకెట్లు అందుబాటులో ఉంచుతున్నాం ఉపాధి పనులు జరిగే చోట ఎవరైనా అస్వస్థకు గురైతే, ఓఆర ఎస్ కలిపి నీటిని తాగాలి తాగునీటికి సంబంధించిన నగదు డబ్బులు కూలీల ఖాతాలో జమ చేస్తారు తమకు సమాచారం ఇవ్వాలని సమర్పిస్తే రూ రెండు లక్షల వరకు పరిహారం ఇస్తారని తెలిపారు.