- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్నికల నియమావళి అమలుకు గ్రీవెన్స్ కమిటీ
దిశ, సంగారెడ్డి : పార్లమెంట్ ఎన్నికలు -2024 ఎన్నికల నియమావళి అమలులో భాగంగా గ్రీవెన్స్ కమిటీనీ ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. లోక్ సభ ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల తనిఖీల్లో పట్టుబడిన నగదును విడిపించుకోవడానికి ఈ గ్రీవెన్స్ కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. రూ. 50 వేలకు పైగా నగదు తీసుకు వెళ్ళేటప్పుడు సంబంధిత ధ్రువపత్రాలు తమ వెంట ఉంచుకోవాలని తెలిపారు. తనిఖీల్లో రూ. 10 లక్షలకు పైగా పట్టుపడితే ఐటీ శాఖకు సమాచారం అందిస్తామని తెలిపారు. జిల్లా గ్రీవెన్స్ కమిటీ సభ్యుల మొబైల్ నంబర్లు జ్యోతి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి, 9281487272, , జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి బాలశౌరి 6300614057, జహీరాబాద్ డివిజన్ సబ్ ట్రెజరీ అధికారి వి. నర్సింహాచారి 7799934149 ఎవరికైనా ఏదైనా సమస్యలు ఉత్పన్నమైతే పైన పేర్కొనబడిన అధికారులను సంప్రదించాలని సూచించారు.