- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫిల్లింగ్ ద ఫేమస్ క్యాంపెయిన్ కు విశేష స్పందన..
దిశ, చేగుంట : ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫిల్లింగ్ ద ఫేమస్ క్యాంపెయిన్ కు విశేష స్పందన లభిస్తుందని మెదక్ జిల్లా సేల్స్ అసిస్టెంట్ మేనేజర్ ప్రణయ్ పేర్కొన్నారు. మండల పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలో గల మహాలక్ష్మి పెట్రోల్ పంపులో బుధవారం ఫిల్లింగ్ ద ఫేమస్ క్యాంపెను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీల్స్ అసిస్టెంట్ మేనేజర్ ప్రణయ్ మాట్లాడుతూ నాణ్యమైన పెట్రోల్ డీజిల్ ఉత్పత్తులకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మొదటి స్థానంలో ఉందని పేర్కొన్నారు.
పెట్రోల్ పంపుకు వచ్చే ప్రతి వినియోగదారుడికి నాణ్యమైన సేవలు అందించడం మొదటి కర్తవ్యంగా బావిస్తున్నట్టు తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి కల్తీ జరగకుండా ఎప్పటికప్పుడు పెట్రోల్ పంపులు తనిఖీ చేస్తూ వినియోగదారుని ఇబ్బందులకు గురి చేయకుండా చూస్తున్నట్లు తెలిపారు. ఫిల్లింగ్ ద ఫేమస్ క్యాంపెన్లో స్థానిక ప్రజాప్రతిని పాల్గొని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అండగా ఉండడం పట్ల వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో పెట్రోల్ పంపు యజమానులు గందె ప్రశాంత్, ప్రవీణ్ తోపాటు రెడ్డిపల్లి సర్పంచ్ లక్ష్మీ జ్ఞానేశ్వర్ గౌడ్, ఎంపీటీసీ శంభుని రవి, మాజీ సర్పంచ్ బాలచందర్ తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.