- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
MLA : ప్రభుత్వం వడ్లకు, కందులకు, మక్కలకు రూ. 500 బోనస్ ఇవ్వాలి
దిశ, నర్సాపూర్ : కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ప్రభుత్వం వడ్లకు, కందులకు, మక్కలకు రూ. 500 బోనస్ ఇవ్వాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి (Narsapur MLA Sunitha లక్ష్మారెడ్డి ) అన్నారు. సోమవారం నర్సాపూర్ శివంపేట మండలాల్లో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సునితారెడ్డి మాట్లాడుతూ… ప్రభుత్వం రైతులకు సంబంధించిన దళారుల వ్యవస్థను నిర్మూలించాలన్న ఆలోచనతో కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఏ గ్రేడ్ ధాన్యానికి రెండు వేల మూడు వందల ఇరవై, బీ గ్రేడ్ ధాన్యానికి ₹2300 ఇస్తున్నట్లు తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నానిన, మొలకెత్తిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కొనుగోలు సెంటర్ ల నిర్వాహకులకు సూచించారు. లారీల కొరత ఉన్నట్టయితే ట్రాక్టర్ ల ద్వారా ధాన్యాన్ని తీసుకుపోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు శేఖర్, సత్యం గౌడ్, నర్సింగ్ రావు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.