గ్రామాలను అభివృద్ధి పథంలో నడపడమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

by Shiva |
గ్రామాలను అభివృద్ధి పథంలో నడపడమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
X

దిశ, గుమ్మడిదల: గ్రామాలను అభివృద్ధి పథంలో నడపడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని దోమడుగు, అన్నారం గ్రామాల్లో రూ.2.5 కోట్ల నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామంలో దళిత బంధు ద్వారా కొనుగోలు చేసిన ద్విచక్ర వాహనాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. వివిధ గ్రామాలకు చెందిన 19 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పాలనలో గ్రామాలను అభివృద్ధి పథంలో నడపడమే తమ లక్ష్యమని ఆయన అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ప్రవీణ విజయభాస్కర్ రెడ్డి, జడ్పీటీసీ కుమార్ గౌడ్, సర్పంచ్ లు, ఎంపీటీసీలు, సీనియర్ నాయకులు, అధికారులు, బీఆర్ఎస్ మండలాధ్యక్షులు షేక్ హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు.

అదేవిధంగా జిన్నారం మండల పరిధిలోని మంగంపేట గ్రామంలో శ్రీరామ నవమి సందర్భంగా ఏర్పాటు చేసిన శ్రీ సీతారాముల రథోత్సవం కార్యక్రమంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం జంగంపేటలో సొంత నిధులతో 40 మంది యువకులకు డ్రైవింగ్ లైసెన్సులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వెంకటేష్ గౌడ్, ఎంపీపీ రవీందర్ గౌడ్, ఆయా గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాజేష్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed