- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నూతన కల్వర్టుల నిర్మాణాలకు శంకుస్థాపన
దిశ, గుమ్మడిదల: జిన్నారం మండల పరిధిలోని అండూరు, వావిలాల జంగంపేట గ్రామాల పరిధిలో రూ. 76 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న కల్వర్టుల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం లక్ష్మీపతి గూడెంలో నూతనంగా నిర్మించిన హనుమాన్ దేవాలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన అనంతరం గత పది సంవత్సరాలలో మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంలో నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధికి ప్రతీకగా తీర్చిదిద్దామని తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి పూర్తి పారదర్శకతతో నిధులు కేటాయించి అభివృద్ధికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వ హయాంలో మంజూరైన పనులను వెంటనే ప్రారంభించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, ఎంపీపీ రవీందర్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటేష్ గౌడ్, పార్టీ మండల అధ్యక్షులు రాజేష్, తాజా మాజీ సర్పంచులు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.