కేసీఆర్ పై పూలవర్షం..జనసంద్రమైన కర్ధనూర్ రహదారి..

by Sumithra |
కేసీఆర్ పై పూలవర్షం..జనసంద్రమైన కర్ధనూర్ రహదారి..
X

దిశ, పటాన్ చెరు : ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఘన స్వాగతం లభించింది. నీలం మధు ముదిరాజ్ ఆధ్వర్యంలోని ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు పూలవర్షం కురిపిస్తూ సీఎం కేసీఆర్ కు స్వాగతం పలికారు. కొల్లూరు డబుల్ బెడ్ రూమ్ ప్రారంభోత్సవనికి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావులను నీలం మధు ముదిరాజ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆప్యాయంగా నీలం మధు ముదిరాజ్ ను పలకరించారు. పార్టీలో బాగా పనిచేస్తున్నావు ఇంకా సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగాలని నేనున్నానంటూ ముఖ్యమంత్రి భరోసా కల్పించారు. అనంతరం కొండకల్ నుండి పఠాన్ చెరు పట్టణానికి వస్తున్న సీఎం కేసీఆర్ కు ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు అపూర్వ స్వాగతం పలికారు. చేతిలో ప్లకార్డులు పట్టుకుని రోడ్డుకు ఇరువైపులా నిలబడి జై కేసీఆర్, జై ఎన్ఎంఆర్ నినాదాలతో హోరెత్తించారు. తన వాహనం నుండి అభివాదం చేస్తూ సీఎం ముందుకు కదిలారు.

అనంతరం నీలం మధు మాట్లాడుతూ పఠాన్ చెరు నియోజకవర్గనికి ముఖ్య మంత్రి కేసీఆర్ రావడం సంతోషకరమన్నారు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడంతో పాటు ప్రజల పై వరాల జల్లు కురిపించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ మూడోసారి అధికారంలోకి వచ్చేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే మనందరం బీఆర్ఎస్ వెంటే ఉండాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మరిన్ని కార్యక్రమాలు ఎన్ఎంఆర్ యువసేనతో చేపడతామన్నారు. నమ్ముకుని నా వెంటే ఉంటున్న అభిమానులు, యువసేన సభ్యుల తోడ్పాటుతో భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు, ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు వేల సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed