ఇంటి స్థలాల క్రమబద్దీకరణకు 30 వరకు గడువు పొడిగింపు: కలెక్టర్ రాజర్షి షా

by Shiva |
ఇంటి స్థలాల క్రమబద్దీకరణకు 30 వరకు గడువు పొడిగింపు: కలెక్టర్ రాజర్షి షా
X

దిశ, మెదక్ ప్రతినిధి: ప్రభుత్వ, అసైన్డ్ భూముల్లో అన్యాక్రాంతంగా ఇళ్లు కట్టుకొని ఉంటున్న పేదలు తమ ఇళ్ల స్థలాలను క్రమబద్దీకరించుకునేందుకు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ఈ నెల 30 వరకు గడవు పొడగించిందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జీవో.నెం.58 ప్రకారం 125 చదరపు గజాలలోపు ఇంటి స్థలాలను ఉచితంగా, జీవో.నెం.59 ప్రకారం 125 చదరపు గజాల పైన ఉన్న ఇంటి స్థలాలకు మార్కెట్ రేటు ప్రకారం ధర చెల్లించిన వారికి పట్టాలివ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.

అయితే, లబ్ధిదారులు జూన్ 2, 2020 కంటే ముందు అట్టి స్థలంలో ఖచ్చితంగా ఇంటి నిర్మాణం గావించి ఉంటున్నట్లు విద్యుత్ లేదా ఇంటి పన్ను చెల్లిస్తున్న రసీదులు ప్రూఫ్ గా సమర్పించవలసి ఉంటుందన్నారు. అర్హులైన వారు ఈ నెల 30 లోగా సమీపంలోని మీసేవా కేంద్రాల్లో యూజర్ చార్జీలు చెల్లించి ఇంటి క్రమబద్దీకరణకు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ఏవైనా సందేహాలు, వివరాలకు సంబంధిత తహసీల్దార్లను సంప్రదించవలసినదిగా కలెక్టర్ సూచించారు.

Advertisement

Next Story