- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
హరీష్ రావుకు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు చురుకులు..
దౌల్తాబాద్, దిశ : మండల పరిధిలోని ఇందుప్రియాల్ గ్రామంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు గురువారం పర్యటించారు. గ్రామంలోని రామాలయంలో ప్రతేక పూజలు నిర్వహించి గ్రామస్థులతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం శక్తి కేంద్రం సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గడిచిన రెండు మూడు రోజులుగా కురిసిన అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన సోయిలేక రాజకీయాలు చేయడం మానుకోవాలని సూచించారు. నియోజకవర్గంలో అకాల వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్న 18 గ్రామాల్లో పర్యటించి రైతులకు భరోసా ఇచ్చామని అన్నారు. మిగతా గ్రామాల్లో పర్యటించి నష్టపోయిన రైతులకు పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.
గత మార్చి నెలలో వరంగల్, ఖమ్మం, మహాబూబాబాద్ జిల్లాలలో అకాల వర్షాల వల్ల నష్టపోయిన ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ పర్యటించి రైతులకు ఎకరాకు 10 వేల చొప్పున నష్ట పరిహారం అందజేస్తామని జీవో విడుదల చేసిన విషయం హరీష్ రావుకు గుర్తులేదా అని మండిపడ్డారు. రైతులకు పంట నష్టం వాటిల్లి అన్యాయం జరిగి, రైతన్నలు కష్టాల్లో ఉంటే రఘునందన్ రావును తిట్టేందుకే ఆర్థిక మంత్రి హరీష్ రావు దుబ్బాకలో పర్యటించారని ఏద్దేవా చేశారు. ఏ ప్రభుత్వమైన ప్రజలు కట్టిన పన్నుల నుండి నష్టపరిహారం ఇవ్వాల్సిందే తప్ప తమ ఇంట్లో నుంచి ఇవ్వరు అనే విషయాన్ని హరీష్ రావు గుర్తుంచుకోవాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయించిన ఎన్డీఆర్ఎఫ్ నిధుల నుండి వెంటనే పంట నష్టం జరిగిన రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఆనంతరం ఎమ్మెల్యే సొంత ఖర్చులతో కుర్మ సంఘానికి బోరు మోటార్, సొంత ఖర్చులతో నిర్మించనున్న కుమ్మరి సంఘ భవనానికి భూమి పూజ చేశారు. నిర్మాణంలో ఉన్న పెద్దమ్మ ఆలయానికి తన వంతు సహాయం అందజేస్తానన్నారు. గ్రామంలో నెలకొల్పిన అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం కోసం ముప్పై వేల రూపాయల తక్షణ ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కిషన్, కోనాయిపల్లి సర్పంచ్ సురేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు భూపాల్ రెడ్డి, రామస్వామి గౌడ్, ఉపాధ్యక్షుడు గడ్డమీది స్వామి, కుమ్మరి నర్సింలు, రాజిరెడ్డి, బిక్షపతి, తిరుపతి, ముత్యాల శ్రీను, సత్యనారాయణ గౌడ్, లక్ష్మణ్, రాజి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Also Read..