డబుల్ బెడ్ రూం దందా.. నకిలీ పట్టాలతో విక్రయాలు

by Shiva |
డబుల్ బెడ్ రూం దందా.. నకిలీ పట్టాలతో విక్రయాలు
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : ఇండ్లు లేని నిరుపేదలకు అందించేందుకు నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లు కొందరు అక్రమార్కుల పాలిట వరంగా మారింది. కొందరు నాయకులు, అధికారులు, దళారులు సిండికేట్ గా మారి రాత్రికి రాత్రే దొంగ పట్టాలను తయారు చేసి అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. సిద్దిపేట పట్టణంలోని నర్సాపూర్ శివారులో గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్ కాలనీ పేరిట 2,424 ఇండ్లను నిర్మించారు. అందులో 2,324 ఇండ్లను నిరుపేదలకు అందజేయగా మిగిలిన ఇండ్ల వివిధ కారణాల దృష్ట్యా పంపిణీ చేయలేదు.

లబ్ధిదారులు సదరు ఇండ్లను అమ్మడం కానీ.. కొనడం చేయరాదు. ఇదిలా ఉంటే డబుల్ బెడ్ రూం ఇండ్లల్లో కొందరు లబ్ధిదారులు వివిధ కారణాలతో నివాసం ఉండటం లేదు. సర్టిఫికెట్ పొంది ఇంటిలో నివాసం ఉండని వారి, పంపిణీ చేయకుండా ఖాళీగా ఉన్న ఇండ్లే టార్గెట్ గా ఈ సిండికేట్ సభ్యులు రంగ ప్రవేశం చేస్తారు. ఇండ్లలో నివాసం ఉండని లబ్ధిదారులకు ఎంతో కొంత అప్పజెప్పి, ఖాళీగా ఉన్న ఇండ్లను బహిరంగ మార్కెట్ లో రూ.3లక్షల నుంచి రూ.4లక్షలకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఇప్పటి వరకు వందల సంఖ్యలో డబుల్ బెడ్ రూంలు వరకు అమ్మకాలు.. కొనుగోళ్లు జరిగినట్లు విశ్వసనీయ సమాచారం.

నాయకుల అండదండతో..

కొందరు నాయకుల అండదండలతో ఈ తతంగం సాగుతుందని డబుల్ బెడ్ వద్ద నివాసం ఉంటున్న కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. డబుల్ బెడ్ రూం వద్ద విధులు నిర్వహించే ఔట్ సోర్సింగ్ ఉద్యోగి, సదరు కాలనీలో ఉద్యోగం చేసే అధికారి కలిసి నకిలీ పట్టాలు తయారు చేసి అమ్మిన వారికి సర్టిఫికెట్లు అందజేస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. కొనుగోలు చేసిన వారు సైతం మోసపోయామని బాధపడుతున్నట్లు సమాచారం.

పట్టించుకోని అధికారులు

నిరుపేదలకు దక్కాల్సిన డబుల్ బెడ్ రూంలను ధనార్జనే ధ్యేయంగా కొందరు అమ్మకాలు కొనసాగుతుండటం పట్ల ఉన్నతాధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటం ఆరోపణలకు తావిస్తోంది. ప్రభుత్వ ఆశయానికి విరుద్ధంగా కొ00ద్దిపేట పట్టణంలో ఓ ఇంటిలో కిరాయికి ఉంటున్న ఓ వ్యక్తి మరణించగా.. దహన సంస్కారాల అనంతరం సదరు కుంటుంబ సభ్యులను ఇంటి యజమాని ఇంటిలో రానివ్వకపోవడంతో శ్మశాన వాటిక వద్ద గల గదిలో ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న నాటి మంత్రి తన్నీరు హరీశ్​ రావు అప్పటికప్పుడు సదరు కుంటుబానికి డబుల్ బెడ్ రూం మంజూరు చేయించారు. సదరు కుంటుంబానికి కేటాయించిన ఇంటి నెంబర్ అధికారులు ఇచ్చి పట్టా సర్టిఫికేట్ లో ఇంటి నెంబర్ వేరుగా పడింది. సదరు కుంటుంబం అధికారులు చూపిన ఇంటిలో నివాసం ఉంటున్నారు. సదరు కుంటుంబం పేరిట సర్టిఫికేట్ ఇచ్చిన ఇంటిని ఎవ్వరికి కేటాయించలేదు. రంగ ప్రవేశం చేసిన దళారులు నకిలీ పట్టా సర్టిఫికెట్ తయారు చేసి అమ్ముకున్నట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed