- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సివిల్ తగాదాల్లో తల దూర్చొద్దు : ఎస్పీ
by Kalyani |

X
దిశ, సంగారెడ్డి అర్బన్ : పోలీస్ సిబ్బంది సివిల్ తగాదాల్లో తలదూర్చినా, ఇల్లీగల్ కార్యకలాపాలకు పాల్పడినట్లు తనకు దృష్టికి వస్తే శాఖ పరమైన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ పంకజ్ హెచ్చరించారు. శనివారం సాయంత్రం సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ లో ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా స్టేషన్ లో ఉన్న రికార్డులను పరిశీలించిన అనంతరం పెండింగ్లో ఉన్న నాన్ బెయిలబుల్, ఇతర కేసులను వెంటనే పూర్తి చేయాలన్నారు. స్టేషన్కు వచ్చిన వారితో మర్యాదగా ప్రవర్తించాలని సిబ్బందికి సూచించారు. ఉద్యోగపరమైన ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని అందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. ఎస్పీ వెంట సంగారెడ్డి రూరల్ సీఐ క్రాంతి కుమార్, ఎస్సై రవీందర్ ఉన్నారు.
Next Story