suicide attempt : భూమి రిజిస్ట్రేషన్ చేయొద్దు

by Sridhar Babu |
suicide attempt : భూమి రిజిస్ట్రేషన్ చేయొద్దు
X

దిశ, ఆందోల్ : మా కుటుంబానికి చెందిన భూమి రిజిస్ట్రేషన్ ఆపాలంటూ ఓ మహిళ ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. చౌటకూర్ మండలం సరాఫ్ పల్లి కి చెందిన దర్జి లక్ష్మి అనే మహిళ భూమి కోసం ఒంటి పై పెట్రోల్ పోసుకుని తహసీల్దార్ కార్యాలయం ముందు ఆత్మ హత్యాయత్నానికి పాల్పడింది. సారపల్లికి చెందిన దర్జీ మల్లేశంతో గత కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. మల్లేశం గత తొమ్మిదేళ్ల క్రితం మరణించడంతో దర్జీ లక్ష్మి అత్తమామతో కాకుండా అదే గ్రామంలో వేరేచోట నివాసం ఉంటుంది.

వీరికి చెందిన భూమి గ్రామ శివారులోని సర్వే నంబర్ 354/1 లో 8 గుంటల ఆమె అత్త దర్జి అనుసూయ పేరిట ఉంది. ఈ భూమిని అమ్ముకునేందుకు శనివారం తహసీల్దార్ కార్యాలయానికి ఆమె అత్త మామలు వచ్చారు. ఈ విషయాన్ని తెలుసుకున్న దర్జి లక్ష్మి రిజిస్ట్రేషన్ చేయొద్దంటూ పెట్రోల్ పోసుకొని తహసీల్దార్ కార్యాలయం ముందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో ఆమె అత్త-మామ లు రిజిస్ట్రేషన్ చేయకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. తహసీల్దార్ ను కలిసి ఈ భూమి రిజిస్ట్రేషన్ చేయొద్దు అంటూ వినతి పత్రాన్ని సమర్పించారు.

నాకు ఏ ఆధారం లేదు

నా భర్త 9 సంవత్సరాల క్రితం చనిపోయాడని అప్పటి నుంచి తనను మా అత్తమామ అనసూయ లక్ష్మీనారాయణలు పట్టించుకోవడంలేదని ఆమె వాపోయారు. మా ఆత్త పేరిట ఎనిమిది గంటల భూమి ఉందని, ఈ భూమిని ఎవరికీ అమ్మొద్దని ఎన్నోసార్లు చెప్పినా వారు అమ్ముకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారని ఆమె ఆవేదనను వ్యక్తం చేశారు. నాకు ఒక కొడుకు ఉన్నాడని, ఈ భూమి తప్ప మరే ఏ ఆస్తి లేదని ఆమె తెలిపారు. ఈ భూమిని ఇతరుల పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తే తాను ఆత్మహత్య చేసుకుంటానని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed