ధరణి పోర్టల్ ఒక అద్భుతం : మంత్రి హరీష్ రావు

by Shiva |   ( Updated:2023-06-07 15:22:45.0  )
ధరణి పోర్టల్ ఒక అద్భుతం : మంత్రి హరీష్ రావు
X

సదాశివపేట తహసీల్దార్ ను ప్రశంసించిన మంత్రి

దిశ, సదాశివపేట : ధరణి పోర్టల్ ఒక అద్భుతం అని మంత్రి హరీష్ రావు అన్నారు. బుధవారం ఉదయం సదాశివపేట మండల కేంద్రన్ని సందర్శించి నిర్వహిస్తున్న ధరణి పోర్టల్ పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో ధరణి పోర్టల్ సమస్యలపై హరీష్‌రావు ముఖాముఖి నిర్వహించారు. ధరణి పోర్టల్ విధానంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు. విజయవంతంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా మరింత వేగవంతంగా పనులు కొనసాగిస్తున్న తహసీల్దార్ పని విధానాన్ని రైతులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.

దీంతో మంత్రి స్థానిక తహసీల్దార్ మనోహర్ చక్రవర్తిని ప్రశంసించి అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి ఆయన మాట్లాడుతూ.. గతంలో రిజిస్ట్రేషన్ కోసం అనేక సమస్యలుండేదని తెలిపారు. ధరణి ఒక విప్లవాత్మకమైన కార్యక్రమని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని స్వయంగా రూపొందించారని తెలిపారు. నిజమైన భూ యజమానులకు భూమిపై పూర్తి హక్కు కల్పించాలని, భూమి బదిలీ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలన్నదే ధరణి ముఖ్య ఉద్దేశమని అన్నారు.

భూముల అమ్మకాలు కొనుగోళ్లు విజయవంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు. పూర్తి పారదర్శకంగా ధరణి రిజిస్ట్రేషన్లు 15 నిమిషాల్లో పూర్తవుతున్నాయని తెలిపారు. ధరణి పోర్టల్ లో ఎలాంటి సమస్య లేదని, సాంకేతిక సమస్యలే కొన్ని ఉన్న వాటిని పరిష్కరించామని తెలిపారు. అనంతరం బుధవారం రిజిస్ట్రేషన్ అయినా డాక్యుమెంట్లను మంత్రి చేతుల మీదుగా రైతులకు అందించారు. మంత్రితో పాటు రాష్ట్ర చేనేత సహకార సంఘం అభివృద్ధి చైర్మన్ చింతా ప్రభాకర్, బీఆర్ఎస్ నాయకులు, తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed