Collector kranti : ధరణి, ప్రజావాణి దరఖాస్తులు ఆన్ లైన్ ఎంట్రీ పూర్తి చేయాలి

by Sridhar Babu |
Collector kranti : ధరణి, ప్రజావాణి  దరఖాస్తులు ఆన్ లైన్ ఎంట్రీ పూర్తి చేయాలి
X

దిశ, సంగారెడ్డి : ధరణి, ప్రజావాణి దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేసి, పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన ఆన్ లైన్ ఎంట్రీ పూర్తి చేయాలని, ధరణి సమస్యలను వారంలోపు పరిష్కరించాలని రెవెన్యూ అధికారులను జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు ఆదేశించారు. జిల్లాలోని ఆర్డీవోలు, తహసీల్దార్లతో ధరణి, ప్రజావాణి అప్లికేషన్లను త్వరితగతిన పరిష్కరించాలని శుక్రవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో దరఖాస్తులను క్షేత్రస్థాయి విచారణ , రికార్డుల పరిశీలన , సంబంధిత దరఖాస్తులను ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో

అప్ డేట్ చేస్తూ డిస్పోస్ చేయాలని అన్నారు. దరఖాస్తుల సత్వర పరిశీలన కోసం అవసరమైతే అదనపు బృందాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఆర్ఎస్ఆర్ లిమిట్, మిస్సింగ్ సర్వే నెంబర్లు, సక్సెషన్, పీఓబీ, మ్యూటేషన్ మొదలైన వివిధ సమస్యల పరిష్కారానికి అనుసరించాల్సిన పద్ధతుల పై అధికారులకు పలు సూచనలు చేశారు. కోర్టు కేసులు, పీఓబీ కేసులు అన్నింటిని పరిష్కరించాలన్నారు. మ్యుటేషన్, సక్సేషన్,

నాలా కన్వర్షన్, ఖాతా మెర్జింగ్, పాస్ పుస్తకాలలో డేటా కరెక్షన్, టీఎం 33 తదితర అంశాలకు సంబంధించిన దరఖాస్తులను తహసీల్దార్లు స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలన జరపాలన్నారు. టీఎం-33 లో తిరస్కరించినవి ఉంటే వెంటనే కలెక్టరేట్ కు పంపించాలని ఆదేశించారు. తహసీల్దార్ పరిధిలోని ప్రజావాణి ఫిర్యాదులు కంది మండలం, పటాన్ చెరు మండలంలో ఎక్కువగా ఉన్నాయని, ఈ నెలాఖరివరకు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ టెలీకాన్ఫరెన్సు లో రెవెన్యూ అదనపు కలెక్టర్ మాధురి, ఆర్ ర్డీఓలు, తహసీల్దార్లు పాల్గొన్నారు.



Next Story