- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఉపాధి హామీ పనుల్లో అపశృతి.. అక్కడికక్కడే మృతి చెందిన మహిళ
by Anjali |
X
దిశ, దౌల్తాబాద్: మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో పని చేసేందుకు వెళ్లిన కూలీ, మృతి చెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల పరిధిలోని చెట్ల నర్సంపల్లి గ్రామానికి చెందిన పస్సుల అనిత (34) రోజు లాగే గ్రామంలో జరుగుతున్న జాతీయ ఉపాధి హామీ పనులకు వెళ్లింది. పనిచేస్తుండగానే బురుగులు కక్కుతూ అక్కడికక్కడే మృతి చెందింది. అనితకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె దీపిక, దీక్ష, అనాధలయ్యారు. తల్లి ఉదయం పూట జాతీయ ఉపాధి పని చేసుకుంటూ మిగతా సమయంలో కూలీ పనులు చేస్తూ పిల్లలను పోషిస్తూ ఉండేదని గ్రామస్తులు తెలిపారు. కాగా వెంటనే ప్రభుత్వమే ఆదుకోవాలంటూ గ్రామస్థులు కోరారు.
Advertisement
Next Story