పగిలిన భగీరథ పైప్ లైన్.. భారీ ఎత్తున ఎగసిపడుతున్న నీరు

by Shiva |
పగిలిన భగీరథ పైప్ లైన్.. భారీ ఎత్తున ఎగసిపడుతున్న నీరు
X

దిశ, అల్లాదుర్గం : రూ.వేల కోట్లు ఖర్చు చేసి ప్రతి గ్రామానికి మంచి నీరందించాలన్న సంకల్పంతో ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టింది. నేటికీ కొన్ని గ్రామాల ప్రజలకు నీళ్లు అరకొరగానే అందుతున్నాయి. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం మీదుగా నిజాంబాద్ ప్రాంతానికి భగీరథ సరఫరా చేస్తున్న పైప్ లైన్ చిల్వర్ గ్రామ సమీపంలో పగిలిపోయి నీరు వృథాగా పోతోంది.

భారీ ఎత్తున నీరు ఎగిసిపడుతుంటంతో ప్రధాన రహదారిపై మట్టి చేరి వాహనాదారులకు ఆటంకంగా మారింది. పైప్ లైన్ పగిలిన సమయంలో ప్రధాన రహదారిపై వాహనదారులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ క్రమంలో అటుగా వెళ్తున్న వారు పైప్ లైన్ పగిలిన విషయాన్ని సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. దీంతో నీటి సరఫరా నిలిపివేయడంతో ఆ ప్రాంతంలో నీళ్ల ప్రవాహం తగ్గుముఖం పట్టింది.

గతంలో కూడా చిల్వర్ గ్రామ సమీపంలో నిజాంబాద్ పైప్ లైన్ పగిలి నెలలు గడవక ముందే మళ్లీ పైప్ లైన్ పగలడంతో సమీప ప్రజలు భయాందోళలనకు గురవుతున్నారు. ఏది ఏమైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పగిలిన పైప్ లైన్ కు వెంటనే మరమ్మతు చేపట్టి, భవిష్యత్తు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed