- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అటవీ శాఖలో అవినీతి మొక్కలు..!

దిశ, మెదక్ ప్రతినిధి : నర్సాపూర్ అటవీ శాఖలో భారీ అవినీతి బాగోతం వెలుగులోకి వచ్చింది. ప్లాంటేషన్ చేయకుండానే నీళ్లు పెట్టినట్లుగా తప్పుడు రికార్డులు సృష్టించి రూ.9 లక్షలకు పైగా సొమ్ము స్వాహా చేసిన వైనం సోషల్ ఆడిట్ లో వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో టెక్నికల్ అసిస్టెంట్ పై చర్యలకు సిఫార్సు చేస్తూ సొమ్ము రికవరీకి ఆదేశించిన వైనం చోటు చేసుకుంది.. జాతీయ ఉపాధి హామీ పథకం లో భాగంగా నర్సాపూర్ అటవీ శాఖ ఆధ్వర్యంలో 2020- 23 సంవత్సరం లో ఎనిమిది గ్రామాల్లో మొక్కలు నాటేందుకు ఉపాధి పథకంలో రూ.20లక్షలు నిధులు మంజూరు అయ్యాయి. అయితే ఇక్కడే అధికారులు గోల్మాల్ ప్రదర్శించారు. ఎనిమిది గ్రామాల్లో చేసిన ప్లాంటేషన్ లో ఎక్కడ నిబంధనలు పాటించలేదని సోషల్ ఆడిట్ సిబ్బంది గుర్తించింది. మొక్కలు సగమే నాటిన మొక్కలకు నాటని వాటికి కూడా ట్యాంకర్ లు పెట్టీ బిల్లులు కాజేయడం గమనార్హం. కూలీలకు చెల్లించిన డబ్బులో జాబ్ కార్డులు సక్రమంగా లేకపోవడం కూడా గుర్తించినట్లు సోషల్ ఆడిట్ బృందం గుర్తించింది. ప్లాంటేషన్ నిర్వహణ, పర్యవేక్షణ అంతా అటవీ శాఖ అధికారాల నిర్లక్ష్యం ఉన్నట్టు గుర్తించినట్టు తెలిసింది. సుమారు రూ.9 లక్షలకు పైగా నిధులు కాజేసినట్లు ఆడిట్ లో వెల్లడైంది. నిధులను దుర్వినియోగం చేసినందుకు టెక్నికల్ అసిస్టెంట్ పై చర్యలకు సిఫార్సు చేశారు.
రేంజ్ పరిధిలో ఎంపిక చేసిన గ్రామాల్లో మొక్కలు తీసుకు రావడం తో పాటు గుంటలు తీసి మొక్కలు నాటాల్సి ఉంటుంది. దీంతో పాటు మొక్క బతికేందుకు అవసరమైన నీటిని కూడా ఉపాధి హామీ నిధులతో అందిస్తారు. నర్సాపూర్ రేంజ్ పరిధిలోని బ్రహ్మణపల్లి, గొల్లపల్లి, నారాయణపూర్, అచ్చంపేట, ఖాగజ్ మద్దూరు, పెద్ద చింత కుంట, నత్నాయిపల్లి గ్రామాల పరిధిలో మొక్కలు తీసుకు వచ్చి గుంటలు తవ్విన కూలీలకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అన్ని బ్లాక్ లలో మొక్కలు నాటడంతో పాటు ప్రతి మొక్కకు నీళ్లు పెట్టినట్టుగా అధికారులు రికార్డులు తయారు చేసి ఉపాధి హామీ పథకం కింద బిల్లులు మంజూరు చేశారు. అటవీ శాఖ చేపట్టిన మొక్కల ప్లాంటేషన్ లో ఉపాధి హామీ కింద సుమారు రూ.20 లక్షలకు పైగా నిధులతో అటవీ శాఖ ప్లాంటేషన్ చేసింది. 2020 నుంచి 2023 మధ్య కాలంలో ఈ ప్లాంటేషన్ చేసినట్లు రికార్డుల్లో ఉంది. నాటిన ప్రతి మొక్కను కాపాడాల్సిన బాధ్యత సంబంధిత శాఖపై ఉంటుంది. అటవీ శాఖ టెక్నికల్ అసిస్టెంట్ తో పాటు ఫారెస్ట్ అధికారుల పర్యవేక్షణ కూడా ఉంటుంది. శాఖకు సంబంధించిన అధికారులు అంతా ప్లాంటేషన్ జరిగినట్టు నిర్ధారించి కూలీలకు, నీళ్లు అందించిన ట్యాంకర్ లకు బిల్లులు అందించాల్సి ఉంటుంది.
సోషల్ ఆడిట్ లో వెలుగులోకి అసలు బాగోతం..!
నర్సాపూర్ ఫారెస్ట్ రేంజి పరిధిలో ఉపాధి హామి కింద నాటిన మొక్కల అసలు బాగోతం ఈ నెల 15 న నర్సాపూర్ లో జరిగిన సోషల్ అడిట్ లో బట్టబయలైంది. ఉపాధి హామీ పీడీ శ్రీనివాస్ రావు తో పాటు అధికారుల సమక్షంలో ఫారెంట్ రేంజి లో జరిగిన మొక్కల పెంపకం కోసం ఖర్చు చేసిన నిధుల వివరాలు వెల్లడించారు. ఎనిమిది గ్రామాల్లో చేసిన ప్లాంటేషన్ లో ఎక్కడ నిబంధనలు పాటించలేదని సోషల్ ఆడిట్ సిబ్బంది గుర్తించింది. మొక్కలు సగమే నాటిన మొక్కలకు నాటని వాటికి కూడా ట్యాంకర్ లు పెట్టీ బిల్లులు కాజేయడం గమనార్హం. కూలీలకు చెల్లించిన డబ్బులో జాబ్ కార్డులు సక్రమంగా లేకపోవడం కూడా గుర్తించినట్లు సోషల్ ఆడిట్ బృందం గుర్తించింది. ప్లాంటేషన్ నిర్వహణ, పర్యవేక్షణ అంతా అటవీ శాఖ అధికారాల నిర్లక్ష్యం ఉన్నట్టు గుర్తించినట్టు తెలిసింది. సోషల్ ఆడిట్ తనిఖీలో బ్రహణ పల్లి లో రూ. 44964, గొల్ల పల్లి రూ. 3535, నారాయణపూర్ రూ. 135 69, అచ్చంపేట రూ. 31738, ఖాగజ్ మద్దూరు రూ,192720, పెద్ద చింత కుంట రూ. 5972, ఖాజీపేట రూ 368564, నత్నాయిపల్లి రూ 296676 లక్షల నిధులు స్వాహా అయినట్లు వెల్లడించారు. ఇందులో తొమ్మిది లక్షలకు పైగా సొమ్ము కాజేసినట్టు అడిట్ బృందం నిగ్గు తేల్చింది. మొక్కల ప్లాంటేషన్ జరగనట్టు గుర్తించిన అధికారులు సొమ్ము రికవరికి సంబంధిత శాఖకు రాసినట్టు డి అర్ డి ఎ పిడి తెలిపారు. నిధులను దుర్వినియోగం చేసినందుకు టెక్నికల్ అసిస్టెంట్ పై చర్యలకు సిఫార్సు చేశారు.
తప్పంతా కాంట్రాక్టు అధికారి పైనే..!?
అటవీ శాఖలో జరిగిన అవినీతి అంతా కాంట్రాక్టర్ పద్ధతిలో విధులు నిర్వర్తిస్తున్న టెక్నికల్ అసిస్టెంట్ పైనే నెట్టడం పై విమర్శలు వస్తున్నాయి. అటవీ శాఖ బాధ్యత చెట్లను రక్షించడం. ఆ శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటకుండ నాటునట్టు రికార్డులు చేసిన డబ్బులు స్వాహా చేయడం కాంట్రాక్టు అధికారికి సాధ్యమేనా.. రేంజి లో విధులు నిర్వహిస్తున్న బీట్, సెక్షన్, రేంజ్, డి ఎఫ్ వో స్థాయి అధికారులకు తెలియకుండానే జరిగిందా అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మహిళా అందులో కాంట్రాక్టు అధికారిని భాధ్యురాలిని చేసిన అధికారులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. గ్రామాల్లో ఎంత ప్లాంటేషన్ జరిగింది, ట్యాంకర్ ల బిల్లులు ఎవరు పేరిట వెళ్లాయి.. వాటికి సంబధిత వివరాలు సేకరిస్తే నిధులు స్వాహా చేసిన వారి గట్టు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. నిబంధనల ప్రకారం మొక్కలు నీరు అందించే ట్యాంకర్ బిల్లులు గ్రామ పంచాయతీ నుంచి అందివ్వాలి, కానీ ఇక్కడ వేరే వారుకి ట్యాంకర్ బిల్లులు ఇవ్వడం పై కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సమగ్ర విచారణ జరిపితే సొమ్ము స్వాహా చేసిన అధికారుల అవినీతి బాగోతం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.