- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ కథనం పై స్పందించిన కలెక్టర్
దిశ, సంగారెడ్డి: ఆక్రమణలపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. పోస్టల్ శాఖ భూమి ఆక్రమణ, రాత్రికి రాత్రి రోడ్డు నిర్మాణం దిశ దిన పత్రిక ప్రచురించిన కథనానికి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి స్పందించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆక్రమణలు ఉపేక్షించవద్దని ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత అధికారులదేనని, దీనిపై ఫీల్డ్ విజిట్ చేసి తనకు పూర్తి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ హుకుం జారీ చేశారు. దీంతో రెవెన్యూ, మున్సిపల్ అధికారులు సర్వే నంబర్ 374 పోస్టల్ శాఖ భూమిలో నిర్మించిన అక్రమ రోడ్డు నిర్మాణాన్ని పరిశీలించారు. ఆ భూమిలో 20 ఫీట్ల రోడ్డును ఎలాంటి అనుమతి లేకుండా, ఎలాంటి మంజూరు లేకుండా అక్రమంగా నిర్మించారని నిర్దారించారు. అదే విధంగా అక్రమంగా ఆ స్థలంలో బైక్ మెకానిక్ షెడ్ నిర్మించారని గుర్తించారు. ఆ భూమి రెండెకరాల భూమిని పోస్టల్ శాఖకు కేటాయించడం జరిగిందని, అందులో కొందరు అక్రమంగా 2 పీట్ల రోడ్డును నిర్మించారన్నారు.
పోస్టల్ శాఖ భూమిలో రోడ్డు నిర్మాణం నిజమే : సంగారెడ్డి తహసీల్దార్ దేవదాస్
సర్వేనెంబర్ 374 లో పోస్టల్ శాఖకు రెండెకరాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించడం జరిగిందని, ఆ భూమి పూర్తిగా పోస్టల్ శాఖకే చెందుతుందన్నారు. ఆ భూమిలో అక్రమంగా మోరంతో రోడ్డు నిర్మాణం చేశారు. ఆ రోడ్డు నిర్మాణానికి మున్సిపాలిటీ నుంచి గానీ, ప్రభుత్వం నుంచి గానీ మంజూరు లేదు. కానీ కొందరు ఇండ్లకు ఆనుకుని ఉన్న భూమి నుంచి అక్రమంగా 20 ఫీట్ల రోడ్డు నిర్మించారు. అక్రమంగా నిర్మించిన ఆ రోడ్డును తొలగిస్తాం. అనుమతులు లేకుండా రోడ్డు నిర్మించడం చట్టరీత్యా నేరం. భూమికి సంబంధించి అందులో ఎలాంటి నిర్మాణాలు జరిగాయి అనే దానిపై కలెక్టర్‌కు నివేదిక అందించాం. కలెక్టర్ ఆదేశాలతో చర్యలు తీసుకుంటున్నాం, ప్రభుత్వ భూములను ఆక్రమించడం, అక్రమ నిర్మాణాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ భూములు కాపాడేందుకు ప్రజలు సహకరించాలి. పోస్టల్ శాఖకు కేటాయించిన భూమిని ఆ శాఖ పట్టించుకోకపోవడం వల్లే అక్రమ నిర్మాణాలు జరిగాయి. ఆ భూమిని స్వాధీనం చేసుకుంటాం. మరేదైనా ప్రభుత్వ అవసరాలకు ఉపయోగిస్తాం.