SP Rupesh : సీఈఐఆర్ పోర్టల్ సేవలు వినియోగించుకోవాలి

by Sridhar Babu |
SP Rupesh : సీఈఐఆర్ పోర్టల్ సేవలు వినియోగించుకోవాలి
X

దిశ, సంగారెడ్డి : విలువైన మొబైల్ ఫోన్ల దొంగతనాల వలన విసిగివపోతున్న తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి విముక్తి కల్పించడానికై తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ గత సంవత్సరం ఏప్రిల్ నెలలో అందుబాటులోకి తీసుకువచ్చిన సీఈఐఆర్ పోర్టల్ ద్వారా మంచి ఫలితాలు రాబట్టడం జరుగుతుందని సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ అన్నారు. సంగారెడ్డి జిల్లాలో ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందించడానికి, చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న మొబైల్ ఫోన్ల రికవరీ కోసం జిల్లాలో ప్రత్యేక టీంను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గత సంవత్సరం పోర్టల్ ప్రారంభమైన నాటి నుండి ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 1108 ఫోన్ లను రికవరీ చేసి బాధితులకు అందించడం జరిగిందని, ఎవరైనా మొబైల్ పోగొట్టుకున్నా లేదా దొంగిలించినా వెంటనే

SP Rupeshసీఈఐఆర్ పోర్టల్ ( https://www.ceir.gov.in ) నందు బ్లాక్ చేసి, సంబంధిత పోలీసు స్టేషన్ లో సమాచారం ఇవ్వాలని సూచించారు. జిల్లాలో ఎవరైనా సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్ లను కొనుగోలు చేసినట్లైతే ఆ షాప్ యజమాని నుండి రసీదు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. సెల్ ఫోన్ దొంగలు దొంగిలించిన ఫోన్ లను మొబైల్ షాప్ లలో అమ్ముతున్నారని, తక్కువ ధరకు వస్తుందని, దొంగిలించబడిన ఫోన్ అని తెలియక కొనుగోలు చేసి మోసపోతున్నారన్నారు. ఎవరైనా దొంగిలించిన ఫోన్ లను కొనుగోలు చేసినట్లైతే అట్టి వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. సైబర్ నేరాల గురించి అవగాహన కలిగి అప్రమత్తంగా ఉండాలని, అత్యాశకు పోయి అనవసర లింకు లను ఓపెన్ చేయకూడదని, ఆన్లైన్ లో అపరిచితులతో పరిచయాలకు దూరంగా ఉండాలని సూచించారు. సైబర్ నేరాలకు గురైనట్లైతే వెంటనే 1930 కు కాల్ చేసి కానీ, సైబర్ క్రైమ్ (https://www.cybercrime.gov.in ) నందు ఫిర్యాదు చేయాలని సూచించారు.



Next Story