ప్రజలను మభ్యపెట్టినందుకే బీఆర్​ఎస్​ ఓడింది

by Disha Web Desk 15 |
ప్రజలను మభ్యపెట్టినందుకే బీఆర్​ఎస్​ ఓడింది
X

దిశ,పటాన్ చెరు : బీఆర్ఎస్ సర్కారు ప్రజలను మభ్యపెట్టబట్టే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మల్కాజిగిరి మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు అన్నారు. ఇదిగో డబుల్ బెడ్ రూమ్... అదిగో డబుల్ బెడ్ రూమ్ అంటూ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. గురువారం కాంగ్రెస్ పార్టీ పటాన్ చెరు

అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం ఇన్చార్జి కాట శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన మైనంపల్లి హనుమంతరావు గత సర్కారు పాలనను ఎండగట్టారు. పటాన్ చెరులో కాంగ్రెస్ పార్టీకి పటిష్టమైన కార్యకర్తలు ఉండడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. బీసీలంతా ఏకమై ఎంపీ అభ్యర్థి నీలం మధును గెలిపించుకొని కాంగ్రెస్ పార్టీ సత్తా చూపించాలని పిలుపునిచ్చారు.

నీలం మధును గెలిపించుకోవాలి : టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గా రెడ్డి

బడుగు, బలహీన వర్గాల బిడ్డ నీలం మధుని రానున్న ఎన్నికల్లో గెలిపించుకోవాల్సిన అవసరం అందరిపైనా ఉంది అని, ఈ ప్రాంతంలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి అందరికీ తెలుసు అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గా రెడ్డి అభిప్రాయపడ్డారు.

కాంగ్రెస్ తోనే పేదలకు సంక్షేమం : ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మూడు నెలల్లోనే ఇచ్చిన హామీలను నెరవేర్చిందని ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ అన్నారు. అందరి దీవెనలతో ఇందిరమ్మ పోటీ చేసినటువంటి మెదక్ స్థానం నుంచి పోటీచేసె అవకాశం వచ్చిన తనను ఈ ఎంపీ ఎన్నికల్లో గెలిపిస్తే ప్రజా సేవ చేసి రుణం తీర్చుకుంటానని అన్నారు.

మాట మీద కట్టుబడి ఉండేది కాంగ్రెస్ పార్టీ : కాట శ్రీనివాస్ గౌడ్

ప్రజలకు మాట ఇస్తే కట్టుబడి ఉండే పార్టీ కాంగ్రెస్ అని పటాన్ చెరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి కాట శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలలో ఎలాగైతే పనిచేశారో? ఈ పార్లమెంట్ ఎన్నికలలో కలిసికట్టుగా పనిచేసి ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ ను గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ సమావేశంలో పీసీసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ శ్యామ్ గౌడ్, పీసీసీ మెంబర్ శ్రీనివాస్ రెడ్డి, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు నరసింహారెడ్డి, మైనార్టీ, ఎస్సీ బీసీ, మండల కాంగ్రెస్, పట్టణ కాంగ్రెస్, మున్సిపాలిటీ, డివిజన్ అధ్యక్షులు, మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story

Most Viewed