- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మే నెలలో సాధారణ గరిష్ఠం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు : ఐఎండీ
దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా ఎండలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇటీవల కొన్నేళ్లలో చూడని స్థాయిలో ఏప్రిల్ నెలలో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు చూశాం. అయితే, భానుడి నిప్పుల సెగ ఇప్పట్లో తగ్గేలా లేదని భారత వాతావరణ శాఖ తాజా ప్రకటనలో హెచ్చరించింది. మే నెలలో సైతం ఉష్ణోగ్రతలు సాధారణ గరిష్ఠం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ బుధవారం ప్రకటనలో తెలిపింది. హీట్ వేవ్ రోజుల సంఖ్య కూడా 2 నుంచి 8 రోజులు ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. ఈశాన్య, వాయువ్య, మధ్య భారత్‌లలోని కొన్ని ప్రాంతాలు మినహాయించి అన్ని చోట్ల ఉష్ణోగ్రతలు సాధారణ గరిష్ఠం నుంచి ఎక్కువగా ఉండనున్నాయి. దక్షిణ రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్, విదర్భ, గుజరాత్‌లలో మే నెల 5 నుంచి 8 రోజుల పాటు వడగాలులు ఉంటాయని ఐఎండీ అంచనా వేసింది. గత నెల 2016 తర్వాత ఒడిశాలో అత్యధిక హీట్ వేవ్ నమోదైందని ఐఎండీ వెల్లడించింది. ఏప్రిల్‌లో తూర్పు, దక్షిణ ద్వీపకల్ప భారత్‌లో ఎక్కువ వేడి తరంగాలు ఉరుములు, తుఫానులు లేకపోవడం, యాంటీ-సైలోన్ కొనసాగడం వల్ల సంభవించాయని ఐఎండీ చీఫ్ మృత్యుంజయ్ మహాపాత్ర చెప్పారు. దక్షిణ ద్వీపకల్ప భారత్‌లో 1980 నుంచి సాధారణ గరిష్ఠం ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.