రక్తసిక్తమైన ఎస్ఎస్ఏ 161 జాతీయ రహదారి

by Naresh |
రక్తసిక్తమైన ఎస్ఎస్ఏ 161 జాతీయ రహదారి
X

దిశ, చౌటకూర్: మహాశివరాత్రి పర్వదినాన ఆ కుటుంబాల్లో తీరని విషాదం అలుముకుంది. సంగారెడ్డి నాందేడ్ - అకోలా 161 జాతీయ రహదారి రక్తసిక్తమైంది. చౌటకూర్ మండలం శివంపేట గ్రామ శివారులో చార్మినార్ బీర్ ఫ్యాక్టరీ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు గిరిజన కూలీలు మృతి చెందారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. అల్లాదుర్గం మండలం ముప్పారం గిరిజన తండాకు చెందిన నెనావత్ అశోక్ (30) , టేక్మాల్ మండలం మల్కాపూర్ ( అంతాయపల్లి) గిరిజన తండాకు చెందిన లకావత్ శ్రీను (35) లు మోటార్ బైక్ పై జిల్లా కేంద్రమైన సంగారెడ్డి పట్టణంలోని అడ్డపై కూలి పనులు చేసుకుంటూ కుటుంబాలను పోపించుకుటున్నారు. లకావత్ శీను బావ ,నునావత్ అశోక్ తన మోటారు బైక్ పై స్వగ్రామం ముప్పారం తండా నుండి గడి పెద్దాపూర్ చౌరస్తా వరకు వచ్చారు.

లకావత్ శీను ముప్పారం ( అంతాయిపల్లి) తండా నుంచి తన మోటార్ బైక్పై వచ్చి పెద్దాపూర్ చౌరస్తా వద్ద పార్కింగ్ చేసి ఇద్దరు కలిసి అశోక్ మోటారు బైకు పై సంగారెడ్డికి బయలుదేరారు. ఈ క్రమంలో శివంపేట్ బీర్ ఫ్యాక్టరీ వద్దకు రాగానే సంగారెడ్డి నాందేడ్-అకోలా 161 జాతీయ రహదారిపై వెనుక వైపు నుండి వేగంగా వస్తున్న గుర్తు తెలియని వాహనం బైకును ఢీకొట్టింది. ఈ సంఘటనలో బావ బామ్మర్థులిద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. హెల్మెట్ ధరించి మోటార్ బైక్ నింపుతున్న అశోక్, వెనుక కూర్చున్న శీను తలపై నుండి వాహనం వెళ్లడంతో తలలు చిద్రమై, సంఘటనా స్థలం రక్తసిక్తమైంది. ప్రమాదం జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయడం తో ఇద్దరు కుటుంబాల సభ్యులు ఘటన స్థలానికి చేరుకుని బోరున విలపించారు.

ఈ విషయం తెలుసుకున్న పుల్కల్ ఎస్సై శ్రీకాంత్ హుటా హుట ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలకు సంగారెడ్డి ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ప్రమాదానికి గల కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు. అందుబాటులో ఉన్న సీసీ కెమెరాలు పోటేజిలను పరిశీలిస్తున్నారు. ఓకే ప్రమాదంలో బావ బామ్మర్దుద్దరు మృతి చెందడటంతో ఆ కుటుంబాల్లో విషాదం నెలకొంది కాగా ప్రమాద స్థలానికి గిరిజన సంక్షేమ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు జైపాల్ నాయక్ సందర్శించి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద బాధిత గిరిజన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed