- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీ నేతలకు విద్య విలువ తెలియదు: ఎమ్మెల్యే మాణిక్ రావు
దిశ, జహీరాబాద్: బీజేపీ నేతలకు విద్య విలువ తెలియదని ఎమ్మెల్యే మాణిక్ రావు అన్నారు. పది ప్రశ్నాపత్రంల లీకేజీ వ్యవహారంపై క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి రావాలనే దురుద్దేశంతో బీజేపీ నేతలు రాష్ట్రంలో ఇలాంటి అలజడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
బండి సంజయ్, అనుచరగణం ఆధ్వర్యంలో తాండూర్, వరంగల్ ప్రాంతాల్లో పది ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని ఆరోపించారు. అందుకు కారణమైన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, వారిని కూడా పెట్టాలని బీజేపీ నేతలు ధర్నాలు చేయడం వెనుక అంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆభాసపాలు చేసి గద్దె దించాలనే దురుద్దేశంతో బీజేపీ నాయకులు విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న ఎంపీగా బండి సంజయ్, ఇంత వరకు రాష్ట్రానికి కూడా చేసింది ఏమీ లేదన్నారు. సమావేశంలో డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, పార్టీ పట్టణ, మండలాధ్యక్షులు మోహియోద్దీన్, నర్సింహులు, నాయకులు జి.గుండప్ప, మంకల్ సుభాష్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ సంజీవరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు మోహన్ రెడ్డి, ఇజ్రాయిల్ బాబి, సత్యం ముదిరాజ్, తదితరులు పాల్గొన్నారు.