నాడు ఓటుకు నోటు..నేడు దేవుళ్లపైన ఒట్లు : హరీష్ రావు

by Disha Web Desk 11 |
నాడు ఓటుకు నోటు..నేడు దేవుళ్లపైన ఒట్లు : హరీష్ రావు
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : నాడు ఓటుకు నోటు..నేడు దేవుళ్లపైన ఒట్లు అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సెటైర్లు వేశారు. బీఆర్ఎష్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి మాజీ మంత్రి హరీష్ రావు జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...తెలంగాణ కోసం ఉద్యమ సమయంలో రాజీనామా చేయాలంటే రేవంత్ రెడ్డి జిరాక్స్ పేపర్లు ఇచ్చారని, కిషన్ రెడ్డి తిప్పించుకున్నాడని గుర్తుచేశారు. కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదన్నారు. మాజీ సీఎం కేసీఆర్ అమలు చేసిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. రైతు బంధు పథకం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాఫీ కొట్టిందన్నారు.

మాజీ సీఎం కేసీఆర్ అభివృద్ధి, ఆదర్శం అంటే, నేటి సీఎం రేవంత్ రెడ్డి తిట్లలో ఆదర్శంగా ఉన్నారని ఎద్దేవా చేశారు. ఆరు గ్యారెంటీలను అమలు చేస్తే రాజీనామాకు సిద్దంగా ఉన్నట్లు పునరుద్ఘాటించారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ, గ్యారెంటీ లు అమలు చేస్తావో లేదో రేవంత్ రెడ్డి సొల్లు లేకుండా సీదాగా..సూటిగా చెప్పాలన్నారు. నాకు పదవులు ముఖ్యం కాదు రైతులు, ప్రజల ప్రయోజనాలు ముఖ్యమన్నారు. స్పీకర్ ఫార్మాట్ లో ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డికి రాజీనామా పంపించు, నేను 5 నిమిషాల్లో పంపిస్తా అన్నారు. రుణమాఫీ చేయాలని అడిగితే కాంగ్రెస్ మంత్రులు ఎలా తిడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారన్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు పోరాటం చేస్తా అన్నారు. సిద్దిపేట జిల్లాను రద్దు చేయాలని చూస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.



Next Story

Most Viewed