- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
'సీఎంవో కేంద్రంగానే... టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ'
దిశ, సిద్దిపేట ప్రతినిధి: టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. సీఎంవో కేంద్రంగానే టీఎస్ పీఎస్సీ పేపర్ లీకైందని ఆరోపించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ పంక్షన్ కు హాజరైన బండి సంజయ్ విలేఖరులతో మాట్లాడుతూ.. పేపర్ లీకేజీ తతంగం అంతా సీఎంవో ఆఫీస్ కేంద్రంగా, ఎంవో ఆఫీస్ లోని పదవి విరమణ పొందిన ఓ ప్రధాన అధికారి కనుసన్నల్లో జరిగిందన్నారు. అయనే గతంలో సింగరేణి పేపర్లు లీక్ చేశారన్నారు. సీఎం కేసీఆర్ బిడ్డకు సహకరించింది సైతం అయనే అన్నారు. టీఎస్ పీఎస్సీ కమిషన్ వేసే సమయంలో ముగ్గురు వ్యక్తులు కూర్చోని ఈ కమిషన్ పేరు నిర్ణయించినట్లు వెల్లడించారు. వీరందరి గుడి పుఠానితోనే పేపర్ లీకేజీ జరిగిందన్నారు. ఈ విషయం పై విచారణ జరపాలన్నారు. ఈ విషయాలను పక్కదారి పట్టించే క్రమంలో లీకేజీ ఘటనలో సంబంధం ఉన్నవారు అయినప్పటికీ ప్రధాన నింధితులను కాకుండా కింది స్థాయి వ్యక్తులు, ఓ అమ్మాయి, వారి కుటుంట సభ్యులను దోషులుగా చిత్రికరించే ప్రయత్నం జరుగుతుందన్నారు.
ఈ విషయంలో మంత్రి కేటీఆర్, ఉన్నతాధికారుల బండారం బయటపడుతుందనే భయంతోనే సిట్టింగ్ జడ్జితో విచారణకు ప్రభుత్వం వెనకాడుతున్నారన్నారు. ప్రజల ప్రాణాలు బలిగొని అడిదే ఆటగా..పడిందే పాటగా ప్రభుత్వ పెద్దల బరితేగించి వ్యవహరిస్తున్నారన్నారు. పేపర్ లీకేజ్ చేసింది కాకుండా ఇతర పార్టీలపై ఆరోపణలు చేయడం హాస్యస్పదం అన్నారు. టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీ ఘటనలో నిరుద్యోగులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మిలియన్ మార్చ్ మాదిరి నిరుద్యోగ మార్చ్ చేపట్టి ప్రభుత్వం మెడలు వంచి నిరుద్యోగులకు న్యాయం చేసే దిశగా ఉద్యమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్, బీజేపీ నాయకులు కొత్తపల్లి వేణుగోపాల్, చొప్పదండి విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.