ఫోర్జరీ డాక్యుమెంట్లతో ప్లాట్ కబ్జాకు యత్నం...

by Disha Web Desk 11 |
ఫోర్జరీ డాక్యుమెంట్లతో ప్లాట్ కబ్జాకు యత్నం...
X

దిశ,సంగారెడ్డి/పటాన్ చెర : ఫోర్జరీ పత్రాలు తో నకిలీ ఓనర్ ను సృష్టించి ప్లాట్ ను కబ్జా చేయడానికి యత్నించిన 5 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం… అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న కారుపోతుల మహేష్ అనే వ్యక్తి 2023 లో అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలో 120 గజాల ప్లాటును అసలు యజమాని నుంచి కొనుగోలు చేశాడని తెలిపారు. అయితే సదరు ప్లాటు ఖాళీగా ఉండడంతో కన్నేసిన కొందరు తప్పుడు పత్రాలను సృష్టించి నకిలీ ఓనర్ ద్వారా జీపీఏ చేయించుకున్నారని తెలిపారు.

ఈ విషయంలో బాధితుడు ప్రశ్నించగా 20 లక్షలు డిమాండ్ చేశారని పేర్కొన్నారు. దీంతో ఫిర్యాదుదారుడు మహేష్ పోలీసులను ఆశ్రయించడంతో విచారణ చేపట్టిన సీసీఎస్ పోలీసులు ఈ ఫోర్జరీకి కారణమైన 5 మంది నిందితులైన తిరుపతి, దేవేందర్,రవి,వెంకట సుబ్బారావు, స్టీవెన్ సన్ లను అరెస్ట్ చేసి న్యాయస్థానం ఎదుట ప్రవేశ పెట్టమని మరో నిందితుడు దుర్గా ప్రసాద్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. నకిలీ పత్రాలతో భూముల్ని కబ్జా చేస్తే సహించేది లేదని ఎస్పీ రూపేష్ హెచ్చరించారు.



Next Story

Most Viewed