- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కోల్‌కతా నుంచి అక్రమ రవాణా.. హైదరాబాద్‌లో భారీగా బంగారం పట్టివేత
దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. శుక్రవారం ఎయిర్‌పోర్టులో డీఆర్ఐ అధికారులు తనిఖీలు చేస్తుండగా కారు డ్యా్ష్ బోర్డులో రూ.4.5 కోట్ల విలువైన ఆరు కిలోల బంగారం దొరికింది. బంగారం తరలింపునకు సంబంధించిన సరైన పత్రాలు లేకపోవడంతో వాటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆభరణాలను కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు గుర్తించారు. అనంతరం బంగారం స్మగ్లింగ్ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమలులోకి ఉంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎక్కడికక్కడ పోలీసులు, అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే వందలకోట్ల రూపాయల నగదు పట్టుబడుతోంది. తెలంగాణలోనూ పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. పలుచోట్ల నగదు పట్టుబడుతోంది.