కూలీ డబ్బులు పంపకంలో గొడవ… ఆపై హత్య

by Naresh |
కూలీ డబ్బులు పంపకంలో గొడవ… ఆపై హత్య
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : సిద్దిపేట జిల్లా కేంద్రం ఎల్లంకి కాలేజీ సమీపంలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. కూలీ డబ్బులు రూ. 500 కోసం ఇద్దరి మధ్య తలెత్తిన గొడవ కారణంగా వ్యక్తి హత్య చేసినట్లు విచారణలో తేలిందని సిద్దిపేట రూరల్ సీఐ యం. శ్రీను మీడియాకు వెల్లడించారు. రమేష్, తిరుపతి, రాజయ్య కూలీలు పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈనెల 10వ తేదీన ఎల్లంకి కాలేజీ సమీపంలో ఇల్లు నిర్మాణం చేస్తున్న మేస్త్రి శ్రీనివాస్ ఇసుక మోసే పని నిమిత్తం ముగ్గురిని పిలవగా, పనిచేసిన అనంతరం మేస్త్రి రూ.2 వేల ఇచ్చారు. తిరుపతి రూ.1000 తన దగ్గర ఉంచుకొని, రమేష్, రాజయ్యలకు చెరో రూ. 500 చొప్పున ఇచ్చారు. మరుసటి రోజు పనిదొరక్క పోవడంతో రమేష్ తిరుపతి వద్దకు వచ్చి వెయ్యి రూపాయల నుంచి 5వందలు ఇవ్యాలని కోరాడు.

దీంతో తిరుపతి కూరగాయలు తీసుకొని వస్తానని మార్కెట్ వచ్చి మందు బాటిల్ తీసుకొని రాగా ఇద్దరు కలిసి పక్కనే ఉన్న గుడిసెలో వండుకొని మద్యం సేవించారు. ఈ క్రమంలో తిరుపతి, రమేష్ మధ్య డబ్బుల విషయంలో గొడవ జరగగా తిరుపతి కట్టె తీసుకొని రమేష్‌కు కొట్టగా, రమేష్ ఆదే కట్టె తీసుకొని తిరుపతి బలంగా కొట్టడంతో పడిపోయాడు. ఎల్లంకి కాలేజీ సమీపంలో ఉన్న బురద కాలువలో పడేసి బండరాయితో తలపై కొట్టి చంపినట్లు సీఐ తెలిపారు. ఈ సంఘటన పై సిద్దిపేట రూరల్ ఎస్ఐ అపూర్వ రెడ్డి కేసు నమోదు చేశారు. కేసు పరిశోధనలో భాగంగా రమేష్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా హత్యచేసినట్లు ఒప్పుకొగా అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. క్షణికావేశంలో మద్యం సేవించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని సీఐ శ్రీను సూచించారు.

Advertisement

Next Story

Most Viewed