చెరువు బ్యాక్ వాటర్‌లో మునిగిన ఆరేపల్లి ఇండ్లు

by Mahesh |
చెరువు బ్యాక్ వాటర్‌లో మునిగిన ఆరేపల్లి ఇండ్లు
X

దిశ, నంగునూరు: సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం అక్కెనపల్లి మధిర గ్రామమైన ఆరేపల్లి లో ఇండ్లు నీటిలో మునిగిన బాధితులకు ప్రభుత్వ పరంగా అన్ని విధాలా ఆదుకుంటామని సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి అన్నారు. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువులు కుంటలు నిండుకుండలా నిండాయి. దీంతో అక్కెనపల్లి మధిర గ్రామమైన ఆరేపల్లిలో క్రమక్రమంగా వరద నీరు చెరువులో చేరి నీటిమట్టం ఎక్కువ కావడంతో బ్యాక్ వాటర్‌తో గ్రామం లోని ఇండ్లలోకి నీరు వచ్చింది. దీంతో గ్రామంలో ఉన్న 23 కుటుంబాలకు తాత్కాలికంగా రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో రైతు వేదికలో ఆశ్రయం కల్పించారు.

బుధవారం నాడు జిల్లా కలెక్టర్ మన చౌదరి సిద్దిపేట కమిషనర్ అనురాధ తో కలిసి బాధితులను తాత్కాలిక శిబిరాలను సందర్శించి వారిని ఓదార్చారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. బాధితులకు శాశ్వత గృహాలు నిర్మించేందుకు ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ఆర్జీలను స్వీకరించి ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. ఆశ్రయం పొందుతున్న వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి ఆహార ఇతర అవసర ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని వైద్యాధికారులను సూచించారు. బాధితుల పూర్తి వివరాలతో త్వరితగతిన నివేదిక తో కూడిన ప్రతిపాదనలు పంపాలని తహసీల్దార్ సరితను ఆదేశించారు. బ్యాక్ వాటర్ తో ఇల్లు దెబ్బ తినకుండా చూసేందుకు చెరువులో ఉన్న నీటిమట్టాన్ని తాత్కాలికంగా తగ్గించడానికి ఏర్పాటు చేయాలని ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed