- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐదేళ్ల పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలి
దిశ, సిద్దిపేట ప్రతినిధి: ఏదేళ్ల చిన్నారులందరికీ పల్స్ పోలియో చుక్కలు వేయించాలని కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి అధికారులను ఆదేశించారు. సిద్దిపేట కలెక్టరేట్‌లో పల్స్ పోలియో కార్యక్రమ ఏర్పాట్లపై వైద్య శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. జాతీయ పల్స్ పోలియో దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. జిల్లాలో 93,667 మంది ఐదేళ్లలోపు చిన్నారులను గుర్తించడం జరిగిందన్నారు. 37 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 194 ఉప కేంద్రాల పరిధిలోని 586 పోలియో కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహణ కోసం 57 సూపర్ వైజర్లను 2,453 మంది వాక్సినేటర్లను నియమించడం జరిగిందన్నారు. 37 మొబైల్ టీంలతో బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, అంగన్ వాడీ కేంద్రాల్లో చుక్కల మందు వేయనున్నట్లు తెలిపారు.
మిగిలిన చిన్నారులకు 4,5 తేదీల్లో ఇంటింటికి తిరిగి పోలియో చుక్కలను వేయడం జరుగుతుందన్నారు. సమావేశంలో డీఎంహెచ్ వో కాశీనాథ్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ విజయ రాణి, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ రజిని, డిప్యూటీ డీఎం అండ్ హెచ్‌వోలు డాక్టర్ మల్లేశ్వరి, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు పల్స్ పోలియో పోస్టర్, బ్యానర్‌లను కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి, వైద్యా శాఖ అధికారులతో కలిసి ఆవిష్కరించారు. అదే విధంగా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ పైన జిల్లా కలెక్టర్ మను చౌదరి సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.