విద్యాశాఖ మంత్రిని నియమించాలి.. ఏబీవీపీ డిమాండ్..

by Sumithra |   ( Updated:2024-09-03 12:09:56.0  )
విద్యాశాఖ మంత్రిని నియమించాలి.. ఏబీవీపీ డిమాండ్..
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రిని నియమించాలని ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ వివేక్ వర్ధన్ డిమాండ్ చేశారు. సిద్దిపేటలో ఆయన మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న రూ.7500 కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయాలన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థలు విద్యావ్యాపారానికి అడ్డు కట్ట వేసేలా ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు.

బీ కేటగిరి సీట్లను ఆన్ లైన్ లో భర్తీ చేయాలన్నారు. గురుకుల సంక్షేమ వసతి గృహాలకు పక్కా భవనాలు నిర్మించి, మౌళిక వసతుల కల్పనతో పాటుగా నాణ్యమైన ఆహారం, విద్య అందించాలన్నారు. డైట్ కళాశాలతో ఖాళీగా ఉన్న ప్రిన్సిపాల్స్, లెక్చరర్ పోస్టులు భర్తీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పవన్, నగర కార్యదర్శి పరశురాం, నందు, కార్తీక్, నరేష్, అభినయ్, శ్రీనివాస్, సాయి, గణేష్, రాకేష్, శేఖర్, ధనుష్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story