ఆధార్ అప్ డేట్ చేసుకోవాలి.. అడిషనల్ కలెక్టర్

by Vinod kumar |   ( Updated:2023-03-23 14:55:19.0  )
ఆధార్ అప్ డేట్ చేసుకోవాలి.. అడిషనల్ కలెక్టర్
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి: 2015 కంటే ముందు ఆధార్ కార్డు పొంది ఇప్పటి వరకు అప్ డేట్ చేసుకుని వారు వెంటనే అప్ డేట్ చేసుకోవాలని అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సిద్దిపేట కలెక్టరేట్ లో గురువారం ఆధార్ అప్ డేట్ జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర పథకాలు, బ్యాంక్ సేవలకు ఆధార్ కీలకం అన్నారు.

జిల్లా పరిధిలో ఆధార్ నవీకరణ కోసం కామన్ సర్వీస్ కేంద్రాలతో పాటుగా 9 బ్యాంకులు, 30 పోస్టు ఆఫీస్ లు, 3 బీఎస్ ఎన్ ఎల్ కార్యాలయాలు, 19 గ్రామ పంచాయతీలు, ఎంపీడీవో, తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో సేవలు పొందవచ్చన్నారు. సలహాలు, సూచనల కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1947 లో సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి రాంగోపాల్ రెడ్డి, లీడ్ బ్యాంక్ మేనేజర్ సత్యజిత్, అడిషనల్ డీసీపీ అడ్మిన్ మహేందర్, ఈడియం ఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి : రాష్ట్ర రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త

Advertisement

Next Story