- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Ex Minister: అజ్ఞానిలా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడి మాటలు

దిశ, తెలంగాణ బ్యూరో: పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ అజ్ఞానిలా మాట్లాడుతున్నారని మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఒక ప్రకటనలో విమర్శించారు. ఎవరో వచ్చి తెలంగాణ ప్రజలకు వ్యవసాయం నేర్పించలేదని పేర్కొన్నారు. పీసీసీ అధ్యక్షుడిది రాజకీయ అపరిపక్వత ప్రదర్శించడమే అని తెలిపారు. తెలియకుంటే తెలుసుకోవాలని.. ఆయన మాటలు తెలంగాణ సమాజాన్ని అవమానించడమేనని పేర్కొన్నారు. తన అజ్ఞానాన్ని సమాజం మీద రుద్దడం సంస్కార హీనత అనిపించుకుంటుందని తెలిపారు. దేశంలోనే అందరికంటే ముందు తమ నైపుణ్యంతో వ్యవసాయం అభివృద్ధి చేశారని పేర్కొన్నారు. దానికి పునాదులు వేసింది విష్ణు కుండినులు, శాతవాహనులు, ప్రధానంగా కాకతీయ రెడ్డి రాజులు, అటుపిమ్మట అసఫ్ జాహీ పాలకులని తెలిపారు.
వెయ్యేళ్ల క్రితమే తెలంగాణ నేలపై వరి పండిందని పేర్కొన్నారు. ప్రపంచానికి వాటర్ షెడ్ మేనేజ్మెంట్ నేర్పించింది తెలంగాణ అని, ప్రపంచపు భారీ నీటిపారుదల తొలి ప్రాజెక్టు కట్టింది తెలంగాణలో నిజాంసాగర్ అని వెల్లడించారు. ఇక్కడ ఉన్న వనరులు చూసి బతకడానికి చాలా మంది వలస వచ్చారని తెలిపారు. తెలియకుంటే పండితులను అడిగి పీసీసీ అధ్యక్షుడు తెలుసుకోవాలని సూచించారు. రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించాలనడం ఆయన అవివేకమని తెలిపారు. బేషరతుగా తెలంగాణ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.