వేలంలో వాళ్లను ఎందుకు కొనలేదు?.. సీఎస్కేపై సురేశ్ రైనా సంచలన వ్యాఖ్యలు

by Harish |
వేలంలో వాళ్లను ఎందుకు కొనలేదు?.. సీఎస్కేపై సురేశ్ రైనా సంచలన వ్యాఖ్యలు
X

దిశ, స్పోర్ట్స్ : ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన చెన్నయ్ సూపర్ కింగ్స్ ఈ సీజన్‌లో మాత్రం తేలిపోతున్నది. ఆడిన 8 మ్యాచ్‌ల్లో ఆరింట ఓడింది. గైక్వాడ్ దూరమవడంతో ధోనీ తిరిగి పగ్గాలు చేపట్టినా సీఎస్కే గాడినపడలేదు. ఈ నేపథ్యంలో సీఎస్కే మాజీ క్రికెటర్ సురేశ్ రైనా కీలక వ్యాఖ్యలు చేశాడు. చెన్నయ్ జట్టు ఇంతలా కష్టపడటం తానెప్పుడు చూడలేదన్నాడు.

వేలంలో సీఎస్కే మేనేజ్‌మెంట్ తీరును ప్రశ్నించాడు. ‘వేలంలో మేనేజ్‌మెంట్, కోచ్ ఎక్కడో సరిగ్గా వ్యవహరించలేదు. ఆక్షన్‌లో ఎంతో మంది టాలెంటెండ్ ప్లేయర్లు,యువ క్రికెటర్లు ఉన్నారు. ప్రియాన్ష్ అరంగ్రేట సీజన్‌లోనే సెంచరీ చేశాడు. సెలెక్షన్ కోసం చాలా డబ్బు ఖర్చు పెట్టి ఉంటారు. కానీ, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్‌లను మాత్రం విడిచిపెట్టారు. ఇతర జట్లలోని ప్లేయర్లు ఏ విధంగా ఎటాకింగ్ గేమ్ ఆడుతున్నారో ఓ సారి చూడండి.’ అని కీలక వ్యాఖ్యలు చేశాడు. మరో మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కూడా వేలంలో సీఎస్కే బిగ్ ప్లేయర్లను కొనుగోలు చేయలేదన్నాడు. తీసుకున్న యువ క్రికెటర్లలో గేమ్ చేజింగ్ ప్రదర్శనలు ఇచ్చే వారు లేరన్నాడు.




Next Story

Most Viewed