- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సిద్దిపేటలో సందడి చేస్తున్న మాట్లాడే రామచిలుక
దిశ, సిద్దిపేట ప్రతినిధి: రామ చిలుక.. ప్రతి ఒక్కరికి ఇష్టమైన పక్షి. అందులోనూ మాట్లాడే రామచిలుక అంటే తెలియని ఆసక్తి. అయితే, ఆ చిలుక పెంపుడు చిలుక కాదు. ఎక్కడి నుంచి వచ్చిందో కానీ అమ్మా..అమ్మా అంటూ సందడి చేస్తుంది. వివరాల్లోకి వెళ్లితే సిద్దిపేట జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో మాట్లాడే రామచిలుక టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.
కాలనీలో పలువురి ఇళ్ల వద్ద అగి అమ్మా అమ్మా అని పిలుస్తుడటంతో వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా కాలనీలోకి కూతురి రాజిరెడ్డి ఇంటి వద్దకు ఉదయం, సాయంత్రం వేళల్లో వచ్చి అమ్మా.. అమ్మా అని రామ చిలువ పిలుస్తుండటంతో వారి కుటుంబ సభ్యులు ఆహారం అందిస్తున్నారు. శ్రీరామ నవమి రోజు నుంచి ఇంటికి వస్తున్న మాట్లాడే రామచిలుక వారి కుంటుంబంలో మనిషిలా కలిసిపోయింది.
పిల్లలతో స్నేహంగా ఉంటూ వారితో కాసేపు మాట్లాడి అలరిస్తోంది. అదే విధంగా కాలనీ సైతం పలువురి ఇండ్ల వద్దకు వచ్చి మాట్లాడే రామచిలుక సందడి చేస్తుంది. ఈవిషయం అందరికీ తెలియడంతో రామచిలుకను చూసి తమ సెల్ ఫోన్లలో రామచిలుక మాటలను రికార్డు చేసుకొని అనందం వ్యక్తం చేస్తున్నారు.