- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
వింత వ్యాధితో 6,500 కోళ్లు మృతి
by Kalyani |

X
దిశ ,చిన్నశంకరంపేట: వింత వ్యాధితో 6500 కోళ్లు మృతి చెందిన సంఘటన చిన్న శంకరంపేట మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. మండలంలోని గవ్వల పల్లి మధిర గ్రామం గేరిల్లా తాండ బాణావత్ స్వామి నాయక్ కోళ్ల ఫారం లో వింత వ్యాధితో 6500 కోళ్లు మృతి చెందాయని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి పౌల్ట్రీ ఫార్మ్ రైతులకు ఎక్స్గ్రేషియా చెల్లించాలని స్వామి నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం సాయంత్రం మీడియాతో పౌల్ట్రీ ఫా యజమాని బానోత్ స్వామి నాయక్ మాట్లాడుతూ.. జీవనోపాధిగా కుటీర పరిశ్రమ కింద పౌల్ట్రీ ఫామ్ ఏర్పాటు చేసుకొని జీవనోపాధి పొందుతున్నానని, కాగా వింత వ్యాధితో కోళ్ళన్నీ చనిపోవడంతో పెట్టిన పెట్టుబడి ఎలా తీర్చాలో అర్థం కావడంలేదని కన్నీరుమున్నీరయ్యారు. ప్రభుత్వం వెంటనే తమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
Next Story