తెలంగాణ ఆబ్కారీ శాఖలో భారీగా అధికారుల బదిలీలు

by Ramesh N |
తెలంగాణ ఆబ్కారీ శాఖలో భారీగా అధికారుల బదిలీలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత భారీగా బదిలీలు జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో భారీగా బదిలీలు జరిగాయి. శాఖలో 105 మంది.. జిల్లా జడ్పీ సీఈవో, డీఆర్డీవో, అడిషనల్ డీఆర్డీవో, డీపీవోలనూ ప్రభుత్వం బదిలీ చేసింది.

ఎక్సైజ్ శాఖలో 14 మంది సూపరింటెండెంట్స్, ఇద్దరు ఉప కమిషనర్లు, 9 మంది సహాయ కమిషనర్లను బదిలీ చేస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే రాష్ట్రంలో 395 మంది ఎంపీడీవోలు, 132 మంది తహసీల్దార్లు, 33 మంది నాయబ్‌ తహసీల్దార్లు బదిలీ అయిన సంగతి తెలిసిందే. కాగా, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈసీ నిబంధనల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు బదిలీలు చేస్తున్నాయి.

Advertisement

Next Story