- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మావోయిస్టుల లేఖ కలకలం!
దిశ, గోదావరి ఖని : మావోయిస్టుల లేఖ కలకలం సృష్టించింది. ఆదివాసీల హక్కులకై పోరాటం చేయాలని, గోదావరిఖనిలో ఇళ్ల స్థలాల కోసం పోరాటం చేస్తున్న పేదలకు రూ.10 లక్షలు ఇప్పించాలని లేఖలో మావోయిస్టుల కోరారు. ఇళ్ల పట్టాలు ప్రభుత్వం నుండి అందించాలని బారత కమ్యూనిస్టు పార్టీ( మావోయిస్టు) కోల్ బెల్ట్ ఏరియా కార్యదర్శి ప్రభాత్ పేరిట శుక్రవారం గోదావరిఖని ప్రెస్ క్లబ్ కార్యాలయానికి పోస్టు ద్వారా ఓ లేఖ అందింది.
ఆ లేఖలో కీలక డిమాండ్‌లు
"ఇంద్రవెల్లి అమరుల పోరాట స్పూర్తిని కొనసాగిద్దాం..1981 ఏప్రిల్ 20 ఇంద్రవెల్లి మానని గాయం...42 ఏండ్ల ఇంద్రవెల్లి పోరాట స్ఫూర్తిని సమరోత్సహంతో జరుపుకుందాం. ఇంద్రవెల్లి అమరులకు జోహార్లు అటవీ భూములకు పట్టాలకై పోరాడుదాం, ఆదివాసులకు అండగానిలుద్దాం. ఆదివాసీల హక్కులకై మిలటరీ పోరాటాలు కొనసాగిద్దాం. గోదావరిఖని పట్టణంలో నిరుపేదలు ఇండ్ల స్థలాల కోసం చేస్తున్న పోరాటానికి మావోయిస్టు పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది.
పోరాటం చేస్తున్న నిరుపేదలకు భూములు ఇప్పించవలసిన బాధ్యత, స్థానిక రామగుండం ఎమ్మెల్యే కోరు కంటి చందర్, పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, మంత్రి కొప్పుల ఈశ్వర్‌దే. నిరుపేదల ఇండ్ల నిర్మాణం కోసం ఒక్కొక్కరికి రూ.10 లక్షలు ఇప్పించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులదే, నిరుపేదలకు ఇండ్ల స్థలాలు ఇప్పించవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం.. అని లేఖలో పేర్కొన్నారు.