'మంగళ సూత్రం' వ్యాఖ్యలపై రచ్చ.. మోడీపై చర్యలకు ఈసీ రెడీ!

by Prasad Jukanti |
మంగళ సూత్రం వ్యాఖ్యలపై రచ్చ.. మోడీపై చర్యలకు ఈసీ రెడీ!
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజల సంపంద అంతా మైనార్టీలైన ముస్లింలకు పంచుతుందని, ఆ పార్టీ నాయకులు మహిళల మంగళ సూత్రాలను కూడా వదలరని రాజస్థాన్ ఎన్నికల ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో మోడీ వ్యాఖ్యలపై ఈసీఐ చర్యలకు ఉపక్రమిస్తోందని త్వరలో మోడీపై చర్యలు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ప్రధాని వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ తో పాటు సీపీఐ, పలువురు పౌర సంఘాల నేతలు ఈసీఐకి ఇప్పటికే ఫిర్యాదు చేశారు. మోడీ వ్యాఖ్యలు విభజన, విద్వేషాన్ని ప్రోత్సహించేలా ఉన్నాయని ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని ఆయన ప్రజలను రెచ్చగొడుతున్నారని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో మోడీ స్పీచ్ పై అందిన ఫిర్యాదులపై ఈసీ ఎలా రియాక్ట్ కాబోతున్నది అనేది ఆసక్తిగా మారింది. ఈ ఎన్నికల్లో ప్రభుత్వ సంస్థలతో కలిసి మోడీ మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడుతున్నాడని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పిస్తున్న వేళ రాజస్థాన్ లో మోడీ చేసిన వ్యాఖ్యలపై ఈసీ నిర్ణయం కీలకంగా మారబోతున్నది అనే చర్చ రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని ప్రసంగంపై వచ్చిన ఫిర్యాదులను ఎన్నికల సంఘం పరిశీలించడం ప్రారంభించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే అనుచిత వ్యాఖ్యలు చేసిన నరేంద్ర మోడీపై, బీజేపీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి డిమాండ్ చేస్తున్నారు. ప్రతిపక్షాల నుంచి ఒత్తిడి పెరుగుతున్నందున ఈసీఐ డెసిషన్ సస్పెన్స్ గా మారింది

Advertisement

Next Story