- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
దారుణం.. కన్నతల్లి, ఇద్దరు పిల్లల్ని కడతేర్చిన కసాయి తండ్రి
దిశ,తల్లాడ/సత్తుపల్లి: తల్లాడ మండల పరిధిలోని గోపాల పేట గ్రామానికి చెందిన పిట్టల వెంకటేశ్వర్లు (35)తోపాటు వెంకటేశ్వర్లు తల్లి పిట్టల పిచ్చమ్మ (60) కుమార్తెలు పిట్టల నీరజ (10) పిట్టల ఝాన్సీ (6) తో కలిసి అదే గ్రామంలో నివసిస్తున్నారు. శుక్రవారం రాత్రి పిల్లలతో కలిసి నిద్రిస్తున్న తల్లిని ఇద్దరి పిల్లలను శనివారం తెల్లవారుజామున గొంతుకు చున్నీ బిగించి ఊపిరాడకుండా చేసి ముగ్గురిని చంపి నిందితుడు పరారయ్యాడు. ముగ్గురిని హత్య చేయటానికి కుటుంబ కలహాల లేక ఆర్థిక ఇబ్బందుల కారణాలు తెలియరాలేదు. నిందితుడు గత రెండేళ్లు క్రితం భార్యను కూడా ఇదే రీతిలో హత్య చేసినట్లు సమాచారం. గ్రామస్తుల సమాచారం మేరకు సంఘటనపై స్థానిక సీఐ యన్ సాగర్, తల్లాడ ఎస్సై కొండలరావుతో కలిసి సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను స్థానిక ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.