- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన ఖరారు

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్(Congress) అగ్ర నేతలు మల్లిఖార్జున ఖర్గే(Mallikarjun Kharge), రాహుల్ గాంధీ(Rahul Gandhi) తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈ మేరకు శనివారం కాంగ్రెస్ హైకమాండ్(Congress High Command) అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈనెల 27 తేదీన తెలంగాణకు రాబోతున్నట్లు స్పష్టం చేసింది. సంవిధాన్ బచావో(Samvidhan Bachao) ప్రదర్శనలో పాల్గొనబోతున్నట్లు పేర్కొంది. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 వసంతాలు పూర్తవుతున్నందున ఈ నెల 26న ర్యాలీలు నిర్వహించాలని, అదేరోజు నుంచి 2026 జనవరి 26 వరకు కాంగ్రెస్ నేతృత్వంలో దేశవ్యాప్తంగా చేపట్టబోయే ‘సంవిధాన్ బచావో రాష్ట్రీయ పాదయాత్ర’ను విజయవంతం చేయాలని ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం పార్టీ శ్రేణులకు లేఖ రాశారు. ‘‘రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్న బీజేపీ కుట్రలకు వ్యతిరేకంగా, రాజ్యాంగం పరిరక్షణకు నిర్వహించిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(CWC) సమావేశం ఈ నిర్ణయం తీసుకుంది.