CM రేవంత్ సమక్షంలో టీ.కాంగ్రెస్ ఛీప్‌గా మహేశ్ కుమార్ గౌడ్ బాధ్యతల స్వీకరణ

by Gantepaka Srikanth |   ( Updated:2024-09-15 10:59:45.0  )
CM రేవంత్ సమక్షంలో టీ.కాంగ్రెస్ ఛీప్‌గా మహేశ్ కుమార్ గౌడ్ బాధ్యతల స్వీకరణ
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) బాధ్యతలు స్వీకరించారు. ఆదివారం మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) సమక్షంలో గాంధీ భవన్‌లోని ఆయన ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు. కాగా, బాధ్యతల స్వీకరణకు ముందు గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపానికి మహేశ్ కుమార్ గౌడ్ నివాళులు అర్పించారు.

అక్కడి నుంచి గాంధీ భవన్‌కు తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జి దీపాదాస్ మున్షితో కలిసి భారీ ర్యాలీగా వెళ్లారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ శ్రేణులు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తూ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తానని అన్నారు. తన నియామకానికి సహకరించిన సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకులకులతో పాటు తనపై నమ్మకం ఉంచి హైకమాండ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed