తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్

by Gantepaka Srikanth |   ( Updated:2024-09-06 12:57:07.0  )
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ నియామకం అయ్యారు. ఈ విషయాన్ని శుక్రవారం ఏఐసీసీ అధికారికంగా ప్రకటించింది. రెండు వారాల క్రితమే ప్రక్రియ పూర్తిగా.. ఇవాళ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. అయితే వివిధ సామాజిక కోణాల్లో అధ్యక్షుడి ఎంపికపై చర్చలు జరిగాయి. ఇటీవల ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలు.. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో ఇటీవల ఢిల్లీ వేదికగా ప్రత్యేకంగా చర్చించారు. ఈ చర్చలో బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతకు పీసీసీ పదవిని కట్టబెట్టాలనే తుది నిర్ణయానికి వచ్చి.. మహేశ్ కుమార్‌కు బాధ్యతలు అప్పగించారు.




Advertisement

Next Story

Most Viewed