- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Home > జిల్లా వార్తలు > మహబూబ్ నగర్ > వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి.. ఆస్పత్రి ముందు బంధువుల ఆందోళన
వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి.. ఆస్పత్రి ముందు బంధువుల ఆందోళన
by Nagam Mallesh |

X
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: వైద్యుల నిర్లక్ష్యానికి మహిళ మృతి చెందిన ఘటన జిల్లా కేంద్రం మెట్టుగడ్డ ప్రాంతంలోని 'సిమ్స్' ఆస్పత్రిలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలకు వెళ్తే జిల్లా కేంద్రంలోని సిమ్స్ ఆస్పత్రిలో లాలమ్మ అనే మహిళ చికిత్స నిమిత్తం చేరింది. డాక్టర్లు సరైన చికిత్స అందించకుండా.. నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకే ఆమె మృతి చెందని ఆమె బంధువులు ఆరోపించారు. ఈ సందర్భంగా పలువురు దళిత సంఘాల నాయకులు ఆసుపత్రికి చేరుకుని డాక్టర్ ప్రశాంతి నిర్లక్ష్యం కారణంగానే లాలమ్మ చనిపోయిందని ఆరోపిస్తూ ఆసుపత్రిలో బైఠాయించారు. లాలమ్మ కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.
Next Story