- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహబూబ్ నగర్ ను మహానగరంగా తీర్చి దిద్ధుతాం: మంత్రి శ్రీనివాస్ గౌడ్
దిశ,మహబూబ్ నగర్: శివారు ప్రాంతాల్లో కొత్తగా వెలసిన కాలనీల్లో మౌలిక వసతుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తూ, పాలమూరు పట్టణాన్ని నలు వైపుల విస్తరించి మహానగరంగా తీర్చి దిద్ధుతామని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు,పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పాలకొండ వార్డు పరిధిలో ఉన్న సగర కాలనీలో మంత్రి పర్యటించారు. స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
కొత్తగా ఏర్పడిన కాలనీల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని అందులో భాగంగా దశల వారీగా అన్ని మౌలిక వసతులను కల్పిస్తున్నామని చెప్పారు. కాలనీలో రోడ్డు, కల్వర్టు నిర్మాణంతో పాటు ఇంటింటికి సత్వరం తాగునీరు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా కేంద్రం ఊహించనంత వేగంగా విస్తరిస్తోందన్నారు. పెరుగుతున్న కాలనీలు, జనావాసాలకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. పట్టణంలో శిల్పారామం, కేసీఆర్ అర్బన్ ఎకో పార్క్,నైట్ సఫారీ, నెక్లెస్ రోడ్డు, ట్యాంక్ బండ్, ఐలాండ్, మన్యంకొండ, ఐటీ టవర్ పట్టణానికి తలమానికంగా ఉన్నాయన్నారు.
జిల్లా కేంద్రం ఉద్యోగ ఉపాధి కల్పనకు కేరాఫ్ అడ్రస్ గా నిలువబోతోందన్నారు. అనంతరం మంత్రి కూరగాయల మార్కెట్ లో నిర్మాణంలో ఉన్న వెజ్, నాన్ వెజ్ మార్కెట్ ను, క్లాక్ టవర్ పరిసరాలను ఆయన జిల్లా కలెక్టర్ రవి నాయక్ తో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్, శ్రీనివాస్ రెడ్డి, తిరుమలేష్, లక్ష్మయ్య, శంకర్ తదితరులు పాల్గొన్నారు.