- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మళ్లీ కేసీఆర్ సీఎం కావాలి : ఆల వెంకటేశ్వర్ రెడ్డి
దిశ, దేవరకద్ర : తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్లీ కేసీఆరే సీఎం గా కావాలని బీఆర్‌ఎస్ దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. మదనాపురం మండలం అజ్జకొలు గ్రామంలో సోమవారం కారు గుర్తు అభ్యర్థి ఆల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా మహిళలు బతుకమ్మ లు, బోనాలు, మంగళ హారతులతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆల వెంకటేశ్వర రెడ్డికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి ఆల మాట్లాడుతూ అజ్జకొలు గ్రామంలో 35 కోట్లతో 58 లక్షల నిధులతో గ్రామంలో అభివృద్ధి సంక్షేమం జరిగింది అని అన్నారు. గ్రామంలో మన ఊరు మన బడి పాఠశాల మరియు సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించుకున్నాం. మళ్లీ కేసీఆరే సీఎంగా కావాలి. అప్పుడే అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగుతాయని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు.
అన్ని వర్గాల ప్రజలకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం అండగా నిలుస్తున్నదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో, దేవరకద్ర నియోజకవర్గం గొప్పగా అభివృద్ధి చేశామన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా పనులు చేశాము. ప్రతి ఇంటికీ తాగునీరు అందించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. ప్రజలు ఓటుతో ప్రతిపక్షాలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. దేవరకద్ర లో మరోమారు గులాబీ జెండాను ఎగురవేసేందుకు ప్రజలు సిద్ధం కావాలని కోరారు. తెలంగాణకు సీఎం కేసీఆర్ శ్రీరామరక్ష అన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి ఆల ప్రతి ఒక్కరిని కలిసి ఆప్యాయంగా పలకరించారు. కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గట్టు తిమ్మప్ప, కాటం ప్రదీప్ కుమార్ గౌడ్ , జడ్పిటిసి కృష్ణయ్య, బాల మణెమ్మ పాల్గొన్నారు