- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉద్యోగుల సహకారంతోనే తెలంగాణ సాధించుకున్నాం: మంత్రి శ్రీనివాస్ గౌడ్
దిశ, మహబూబ్ నగర్: ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్ కు ఉద్యోగులు సహకరించడం వల్లనే రాష్ట్రం సాధించుకున్నామని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, స్కృతిక శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో నూతనంగా పునర్నిర్మించిన టీఎన్జీఓ భవనాన్ని గురువారం ఆయన ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డితో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఉద్యోగులకు, సెంట్రల్ పీఆర్సీసీ కన్నా ఎక్కువ జీతాలు ఇస్తున్నామని అన్నారు. జిల్లాలో ఉద్యోగులందరూ మహబూబ్ నగర్ అభివృద్ధికి పాటు పడాల్సిన అవసరం ఉందని మంత్రి పిలుపునిచ్చారు.
కొత్తగా నిర్మించిన టీఎన్జీవో భవనంపై మరో ఫ్లోర్ నిర్మించేందుకు రూ. 50 లక్షల నిధులను మంజూరు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. పార్లమెంట్ సభ్యులు మన్నె శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర మరువలేనిదని, ఉద్యోగుల సహకారంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, దేశానికి ఉద్యోగులు వెన్నెముక లాంటివారని అన్నారు. జిల్లా కలెక్టర్ జి.రవి నాయక్ మాట్లాడుతూ టీఎన్జీవో సంఘంలో జిల్లాలో 4 వేల మంది సభ్యులు ఉన్నారని, సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా తోటి ఉద్యోగులకు సహాయం చేయడం అభినందనీయమన్నారు.
ఈ కార్యక్రమంలో టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, కార్యదర్శి ప్రతాప్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాజీవ్ రెడ్డి, చందర్ నాయక్, మాజీ జిల్లా అధ్యక్షులు రాజేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, ముడా చైర్మన్ గంజి వెంకన్న, టీఎన్జీవో కేంద్ర సంఘం కోశాధికారి శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్మన్ తాటి గణేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ రహమాన్, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జగదీష్, కౌన్సిలర్ పుష్పావతి తదితరులు పాల్గొన్నారు.