కార్పొరేట్ శక్తులకు యువత జీవితాలను తాకట్టు పెట్టిన మోడీకి ఓటుతో బుద్ధి చెబుదాం : వంశీచంద్ రెడ్డి

by Disha Web Desk 11 |
కార్పొరేట్ శక్తులకు యువత జీవితాలను తాకట్టు పెట్టిన మోడీకి ఓటుతో బుద్ధి చెబుదాం : వంశీచంద్ రెడ్డి
X

దిశ, జడ్చర్ల / రాజాపూర్ : విచ్ఛిన్నమైన సిద్ధాంతాలతో దేశాన్ని కుల, మతాల పేరిట దేశాన్ని ముక్కలు చేస్తూ… వ్యవసాయ ,విద్యా, వైద్య, రంగాలను ప్రైవేటీకరణ చేసి కార్పొరేట్ శక్తులకు యువత జీవితాలను తాకట్టు పెట్టిన నరేంద్ర మోడీని గద్దేదించాలని మహబూబ్నగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీ చంద్ రెడ్డి అన్నారు. ప్రజలు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం తథ్యమని ద్వారా దేశవ్యాప్తంగా యువతకు ఉపాధి కల్పించడం సత్యమని స్పష్టం చేశారు. ఆదివారం జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి నేతృత్వంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాలా నగర్ మండలంలోని మోతి ఘణపురం,మేడిగడ్డ తండా, కుర్వగడ్డ తండా, గంగాధర్ పల్లి, సురారం, ఈదమ్మ గడ్డ తండాలతో పాటు రాజాపూర్ మండల కేంద్రంలో ఆదివారం ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు,

ఈ సందర్భంగా గిరిజన తండాలలో,గ్రామాలలో సేవాలాల్,హనుమాన్ దేవాలయాలలో పూజలు నిర్వహించారు. వంశీచంద్ రెడ్డి కి మహిళలు హారతులు పట్టి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వంశీ చంద్ రెడ్డి మాట్లాడుతూ…కార్పొరేట్ శక్తులకు యువత జీవితాలను తాకట్టు పెట్టి ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసి మళ్ళీ అధికారం కోసం వెంపర్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. దేశంలో బిజెపి పాలనలో అసంతృప్తి చెందిన ప్రజల దృష్టిని మరలించేందుకు రాముడిని, మతాన్ని వాడుకుంటూ ఓటు బ్యాంక్ కోసం మత విభజన సృష్టిస్తున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలం చెందిన బీజేపీ పార్టీ అధికారంలో కొనసాగే అర్హత లేదు కాబట్టే ఈ ఎన్నికల్లో నరేంద్ర మోడీని ఓడించాలని అన్నారు.

దేశంలో,రాష్ట్రంలో మోడీ, కేసీఆర్ గజ దొంగల, గుంట నక్కలా అవతారమెత్తి అటు దేశాన్ని అమ్మితే ఇటు కేసీఆర్ రాష్ట్రాన్ని దోచుకుని కుటుంబ సభ్యులకు పంచి పెట్టి సిగ్గులేకుండా 6 గ్యారంటీ పథకాల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రజల స్థితిగతులను, విచ్ఛిన్నమై ఆర్థిక వ్యవస్థకు, కేసీఆర్ అసమర్థత పాలనకు నేడు పల్లెల్లో ప్రజలు అవస్థలు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన ఆంగతకుడు మళ్ళీ ప్రజలను మభ్యపెట్టేందుకు బిజెపితో ఏడడుగులు వేస్తూ వస్తున్న ఈ అవినీతి పార్టీలకు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ఆయన పేర్కొన్నారు.

దేశాన్ని,రాష్ట్రాన్ని దగా చేసిన ఈ నాయకులే మన ప్రాంతాన్ని ఆగం చేసి, దగా చేసి మళ్ళీ ప్రజలను వలస బాట పట్టేలా కుట్రలు చేస్తున్న బీజేపీ,బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఓడించి,పాలమూరు అభివృద్దే లక్ష్యంగా ప్రజాపాలనలో పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని బలపరచి తనను ఎంపీగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి, బాలానగర్, రాజాపూర్ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ నాయక్, కృష్ణయ్య యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు నందిశ్వర్, ప్రదీప్ గౌడ్, కిషన్ నాయక్, నరేందర్ రెడ్డి, సోమ్లా నాయక్, మంజుల, శ్రీశైలం, వేంకటేశ్వర్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, రామానుజ రెడ్డి, దయాకర్ గౌడ్, చంద్రకాంత్, మల్లేష్, హర్శింగ్ నాయక్, చందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed