- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
సీఏఏతో ఎవరి పౌరసత్వాన్నీ తీసేయం : ప్రధాని మోడీ
దిశ, నేషనల్ బ్యూరో: మమతా బెనర్జీ పాలనలో బెంగాల్‌లో చొరబాటుదారులు పెరిగారని, రాష్ట్రంలో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలును ఎవరూ లేరని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రకటించారు. విదేశాల నుంచి వలస వచ్చే హిందువులకు భారతీయ పౌరసత్వాన్ని ఇస్తుండటం వల్లే ప్రతిపక్షాలు సీఏఏను విలన్‌గా చూపిస్తున్నాయని ఆయన విమర్శించారు. సీఏఏ అనేది పౌరసత్వం ఇచ్చేందుకు ఉద్దేశించిన చట్టమే తప్ప.. ఇతరుల పౌరసత్వాన్ని అది తీసివేయదని మోడీ స్పష్టం చేశారు. కాంగ్రెస్, టీఎంసీ వంటి పార్టీలు కలిసి సీఏఏకు అబద్దాల రంగును పులిమాయన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని బరాక్‌పూర్‌లో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోడీ ప్రసంగించారు. ఈసందర్భంగా బెంగాల్ ప్రజలకు ఆయన ఐదు హామీలు ఇచ్చారు. ‘‘మతం ఆధారంగా ఎవరూ రిజర్వేషన్లు ఇవ్వకుండా చూస్తాం. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను ఎవరూ ముట్టుకోలేరు. శ్రీరామనవమి జరుపుకోకుండా మిమ్మల్ని ఎవరూ అడ్డుకోలేరు. రామమందిరంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రద్దు కాదు. సీఏఏ అమలును ఎవరూ ఆపలేరు’’ అని ఆ హామీల గురించి మోడీ తెలిపారు.
బాంబుల తయారీ కేంద్రంగా బెంగాల్‌ను మార్చారు
‘‘ఒకప్పుడు బెంగాల్‌లో అనేక శాస్త్రీయ ఆవిష్కరణలు జరిగేవి. ఇప్పుడు టీఎంసీ పాలనలో రాష్ట్రంలో బాంబుల తయారీ పరిశ్రమ చాలా చోట్ల నడుస్తోంది. ఒకప్పుడు బెంగాల్ చొరబాటుదారులపై తిరుగుబాటు చేసేది. ఇప్పుడు టీఎంసీ రక్షణలో చొరబాటుదారుల సంఖ్య పెరుగుతోంది’’ అని ప్రధాని ఆరోపించారు. అక్రమ వలసదారులపై బెంగాల్ ఉద్యమించే సమయం ఆసన్నమైందన్నారు. బెంగాల్‌లోని టీఎంసీ, ఇండియా కూటమి బుజ్జగింపు రాజకీయాల ముందు లొంగి పోయాయన్నారు. ‘‘హిందువులను భగీరథ నదిలో ముంచేస్తామని ఒక టీఎంసీ ఎమ్మెల్యే అన్నారు. వారి దుస్సాహసం ఎంతటిదో మీరు ఊహించుకోండి. వారికి ఎవరు మద్దతిస్తున్నారో తెలుసుకోండి’’ అని ప్రజలకు మోడీ సూచించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను లాక్కోవాలని ఇండియా కూటమి చూస్తోందన్నారు.