నీ అక్రమ దందాలు మాకు తెలియవా : ఎంపీపీ, జెడ్పీటీసీ

by Sumithra |
నీ అక్రమ దందాలు మాకు తెలియవా : ఎంపీపీ, జెడ్పీటీసీ
X

దిశ, వడ్డేపల్లి : కుటిల రాజకీయాలు, అక్రమ దందాలకు తెర లేపే నువ్వా ఎమ్మెల్యేని విమర్శలు చేసేది ఒకసారి ఎదుటివారిని విమర్శలు చేసే ముందు ఆత్మ పరిశీలన చేసుకోవాలని, మీరు చేసే అక్రమ దందాలు వడ్డేపల్లి మండల ప్రజలకు తెలుసని వడ్డేపల్లి వైస్ఎంపీపీ చంద్రశేఖర్ గౌడ్ ని జడ్పీటీసీ రాజు, ఎంపీపీ రజిత హెచ్చరించారు. అసత్య ఆరోపణలు చేసే ముందు ఆత్మపరిశీలన చేసుకోవాలని ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేదే లేదని వారు అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఎమ్మెల్యే పై వాట్సప్ గ్రూపులలో ఆయన వీడియో చక్కర్లు కొడుతోంది. దానిని ఖండిస్తు..వడ్డేపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రజాప్రతినిధులు మాట్లాడారు.ఎమ్మెల్యే పై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదని తెలిపారు.

నీకు బీఫారం ఇచ్చి ఒక ప్రజా ప్రతినిధిగా మంచి పేరు తెచ్చుకోవాలని ఎమ్మెల్యే సూచిస్తే ఇస్తే దాన్ని విస్మరించి అక్రమ దందాలు చేస్తూ ఆ తప్పులు కప్పిపుచ్చుకొని ఇతరులపై ఆరోపణలు చేస్తావా ? ఇదేనా నీ సంస్కృతి అని మండిపడ్డారు. జులేకల్ గ్రామంలో 248, 250 ఎండోన్మెంట్ సర్వేనంబరులలో నువ్వు చేసిన భూ దందా బాగోతం తెలియదనుకున్నావా! పైపాడ్ శివారులో ఫోర్జరీ సంతకం చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న సంగతి తెలియదనుకున్నవా ! నీ దందాలు, సెటిల్ మెంట్ లు అన్ని తెలుసన్నారు. ఈ కార్యక్రమంలో వడ్డేపల్లి మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు వెంకటేశ్వర్ రెడ్డి, మండల అధ్యక్షులు శ్రీను గౌడ్, ఎంపీటీసీ లతారవిరెడ్డి, సర్పంచులు తిమ్మప్ప, ఆంజనేయులు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ మహేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed